Big Stories

Liver Cells : ట్యూమర్‌ రాకుండా కాపాడే లివర్ సెల్స్..

Liver Cells

Liver Cells : సైన్స్ అండ్ టెక్నాలజీ అభివద్ధి చెందడంతో మానవాలికి ఎంతో మేలు జరుగుతోంది. ఎన్నో హానికరకమైన వ్యాధుల నుండి మనుషులను కాపాడే స్థాయికి టెక్నాలజీ ఎదిగింది. ఒకప్పుడు క్యానర్స్‌కు చికిత్స అనేది లేదు. కానీ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ నుండి కూడా మనిషిని కాపాడే అవకాశం వైద్యులకు దక్కింది. ఇప్పుడు క్యాన్సర్ అసలు శరీరంలోకి రాకుండా ఉండేలా చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా క్యాన్సర్ శరీరంలోకి రాకుండా ఉండేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ధారణకు వచ్చారు. అప్పటినుండి ఈ కోణంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించి కప్ఫర్ సెల్స్ (కేసీ) అనే సెల్స్‌కు క్యాన్సర్ రాకుండా ఉంచే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఒక యాంటి ట్యూమర్‌గా పనిచేస్తుందని గమనించారు. ఇప్పటికే కేసీల ద్వారా పలు జంతువుల్లో ట్యూమర్‌ను తగ్గించే ప్రయత్నం చేసి శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు.

- Advertisement -

మెటాస్టేటిస్ లివర్ వ్యాధుల నుండి కాపాడడానికి కేసీ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. కెసీ సెల్స్ ఎక్స్‌ప్యాన్షన్, రీ ప్రోగ్రామింగ్ ద్వారా ట్యూమర్‌ను అరికట్టే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ట్యూమర్ మెటాస్టేటిస్ సోకిన తర్వాత 90 శాతం మంది పేషెంట్లు మృత్యూవాత పడుతున్నారు. ఒకసారి ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని తట్టుకునే శక్తి లేకపోవడమే ఈ మరణాలకు కారణమవుతుంది. దీనికి చికిత్స అందించినప్పుడు కొందరి లివర్‌కు ఈ ట్రీట్మెంట్‌ను తట్టుకునే శక్తి ఉండదు. అలాంటి సందర్భాల్లోనే కేసీ సెల్స్ వారిని రక్షిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కేసీ సెల్స్‌లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలంగా, వేగవంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే దీనిని ట్యూమర్ కంట్రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ట్యూమర్ చివరి స్టేజ్‌లో ఎలుకలకు కూడా కేపీ సెల్స్ ద్వారా చికిత్స అందించి సక్సెస్ సాధించారు. మెలనోమా, కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లాంటివాటికి కేపీతో చికిత్స అందించవచ్చని వారు కనిపెట్టారు. ఇప్పుడు లివర్ మెటాస్టేటిస్‌పై పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News