BigTV English
Advertisement

Allergies : ఎలర్జీ ఉన్నవారు కూడా తినగలిగే ఎగ్.. టెక్నాలజీతో తయారీ..

Allergies : ఎలర్జీ ఉన్నవారు కూడా తినగలిగే ఎగ్.. టెక్నాలజీతో తయారీ..

Allergies : కొందరికి కొన్ని ఆహార పదార్థాలు తింటే ఎలర్జీ లాంటివి రావడం సహజం. అందుకే అందరూ అన్ని తృప్తిగా తినలేరు. అలాంటి వారికోసమే ఆ ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయాలను వెతికి పెడతారు శాస్త్రవేత్తలు. చాలామందికి నాన్ వెజ్ అంటే ఎలర్జీ ఉంటుంది. అలాంటి వారికోసం ల్యాబ్ గ్రోన్ మీట్ లాంటిది అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా ఎగ్స్ అంటే ఎలర్జీ ఉండేవారి కోసం ప్రత్యేకంగా ఒక పరిష్కారంతో ముందుకొచ్చారు.


శాస్త్రవేత్తలు ఒక స్పెషల్ ఎగ్‌ను తయారు చేశారు. అది ఎగ్స్ అంటే ఎలర్జీ ఉండేవారు కూడా తినే విధంగా ఉంటుందని వారు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎగ్స్ అంటే ఎలర్జీ అనేది కామన్‌గా కనిపిస్తుంది. కొంతమందికి ఈ ఎలర్జీ అనేది 16 ఏళ్లలోపు వరకే ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం ఇది యంగ్ ఏజ్ వరకు ఉంటుందని వారు చెప్తున్నారు. ఎగ్స్ లాంటివి తినాలంటే వికారంగా అనిపించడం, వాంతులు రావడం, కడుపులో నొప్పి.. ఇలాంటివి ఎలర్జీ యొక్క లక్షణాలు. ఈ ఎలర్జీల కారణంగా కొందరు వ్యాక్సినేషన్స్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.

అందుకే శాస్త్రవేత్తలు ఒక ఉపాయంతో ముందుకొచ్చారు. ఎగ్స్‌లో ఎలర్జీని కలిగించే ప్రొటీన్‌ను తొలగించి కొత్త రకమైన ఎగ్‌ను తయారు చేశారు. ఈ ప్రొటీన్ పేరే ఓవోమ్యుకాయిడ్. ఇది చాలావరకు ఎగ్ వైట్స్‌లోనే కనిపిస్తుంది. మార్పులు చేసిన ఈ ఎగ్‌ను ఓవిఎమ్ నాక్‌ఔట్ అంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముందుగా ఈ ఓవిఎమ్ నాక్‌ఔట్ ఎగ్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలంటే ఇవి తినడానికి సేఫ్ అని సర్టిఫై అవ్వాలి. ఎగ్స్‌లో నుండి తీసిన ప్రొటీన్‌ను కూడా ప్రత్యేకంగా స్టడీ చేయాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.


ఎగ్ నుండి ఓవోమ్యుకాయిడ్‌ ప్రొటీన్‌ను తొలగించడానికి టాలెన్ అనే ప్రక్రియను ఉపయోగిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుగా ఈ ప్రక్రియతో ప్రొటీన్‌ను తొలగించిన తర్వాత.. ఎగ్స్‌ నుండి ఆ ప్రొటీన్ తొలగిపోయిందా లేదా తెలుసుకోవడం కోసం ఎన్నో పరీక్షలు చేస్తారు. కేవలం ఓవోమ్యుకాయిడ్ మాత్రమే కాదు.. ఈ జీన్‌తో ఉన్న ఏ ప్రొటీన్ అయినా.. ఎగ్స్‌ వల్ల ఎలర్జీ కలిగేలా చేస్తుందని, అందుకే ఈ ప్రక్రియ ద్వారా ఆ ప్రొటీన్స్ అన్ని తొలగిపోతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. త్వరలోనే ఈ ప్రొటీన్ లెస్ ఎగ్స్‌పై తగిన పరిశోధనలు పూర్తి చేసి మార్కెట్లో అందుబాటులోకి వచ్చేలా చేయాలని శాస్త్రవేత్తలు టార్గెట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×