BigTV English

Electrical Car: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే కారు..

Electrical Car: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే కారు..

Electrical Car: ఈరోజుల్లో ప్రతీ రంగంలో విపరీతంగా పోటీ ఉంటోంది. అలాగే ఆటోమొబైల్ రంగంలో కూడా. ఒకప్పుడు పెట్రోల్ కార్ కొనాలా, డీజిల్ కార్ కొనాలా అని కన్‌ఫ్యూజ్ అయ్యే కస్టమర్లకు ఎలక్ట్రిక్ కార్లు మంచి ఆప్షన్‌లాగా మారాయి. ఎలక్ట్రిక్ కార్లపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకున్న కంపెనీ.. వాటి ప్రొడక్షన్ విషయంలో పోటీ పడడం మొదలుపెట్టాయి. తాజాగా టయోటా మోటర్.. కస్టమర్లకు ఆకర్షించడానికి భారీ ప్లాన్‌తో ముందుకొచ్చింది.


ఎలక్ట్రిక్ బైక్లు అనేవి మార్కెట్లో క్రేజ్‌ను సంపాదించుకున్న తర్వాత ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కస్టమర్లకు అందిస్తున్న సౌకర్యాలు.. మరికొంతమంది కస్టమర్లను ఆకర్షించడానికి ఉపయోగపడింది. అందుకే రాల్స్ రాయిస్ లాంటి కార్ల కంపెనీ సైతం ఎలక్ట్రిక్ కార్ తయారీకి ముందుకొచ్చింది. ఇలాంటి పోటీని తట్టుకోవడం కోసం కంపెనీలు మరిన్ని ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. వాటిలో టయోటా మోటర్స్ కూడా ఒకటి.

టయోటా మోటర్స్ కూడా తమ ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ విషయంలో భారీ ప్లాన్స్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త టెక్నాలజీతో కొత్త మోడల్ కార్లను లాంచ్ చేయడానికి ఈ కంపెనీ రెడీ అవుతోంది. అదిరిపోయే పనితీరుతో కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతోంది. టెస్లాకు పోటీగా తమ కంపెనీలు నిలబెట్టాలనే లక్ష్యంతో టయోటా మోటార్‌ ముందుకెళ్తోంది. నెక్ట్స్ జనరేషన్ బ్యాటరీ తయారీపై కంపెనీ దృష్టిపెట్టింది. 2026 లోపు నెక్ట్స్ జెనరేషన్ లిథియం అయన్ బ్యాటరీలను మార్కెట్‌లోకి తీసుకురానుంది టయోటా.


ఫాస్ట్ చార్జింగ్, లాంజ్ రేంజ్ వంటి ఫీచర్లు లిథయం అయన్ బ్యాటరీల సొంతం. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 1000కి పైగా కిలోమీటర్లు వెళ్లేలా బ్యాటరీని తయారు చేసే పనిలో టయోటా నిమగ్నమైంది. అంతే కాకుండా కేవలం 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయ్యే టెక్నాలజీని తీసుకురానుందని తెలుస్తోంది. టెస్లా మోడల్ వై కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ రేంజ్ కన్నా ఈ కొత్త బ్యాటరీల రేంజ్ చాలా ఎక్కువగా ఉండనుంది. మరి ఈ ప్రయోగంతో టయోటా నెంబర్ స్థానాన్ని దక్కించుకోగలదేమో చూడాలి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×