BigTV English

Trees measurements:-చెట్ల కొలతను సులభంగా తెలుసుకోగలిగే యాప్..

Trees measurements:-చెట్ల కొలతను సులభంగా తెలుసుకోగలిగే యాప్..

Trees measurements:-ఏదైనా వస్తువుపై పరిశోధనలు చేయాలంటే ముందుగా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అలా ప్రపంచంలోని ప్రతీ వస్తువు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల దగ్గర ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. అలాగే చెట్ల కొలతను తీసుకోవడానికి కూడా ఇప్పటికే ఎన్నో పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే ఓ కొత్త పద్ధతిలో చెట్లను కొలవడం వల్ల కచ్చితమైన సమాధానం దొరుకుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.


చెట్లు అనేవి పర్యావరణంలో ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను అదుపులోకి తీసుకొని రావడానికి మొక్కల పెంపకం ముఖ్యమని పర్యావరణవేత్తలు ఇప్పటికే ఎన్నోసార్లు సలహా ఇచ్చారు. అయితే ఈ చెట్లపై పరిశోధనలు చేయాలంటే ముందుగా వీటి కొలతను కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికోసం ఎన్నో పద్ధతులు ఉన్నా.. శాస్త్రవేత్తలు కొత్తగా ఓ కంప్యూటర్ విజన్ టెక్నిక్‌ను చెట్లను కొలవడం కోసం కనిపెట్టారు.

కంప్యూటర్ విజన్ టెక్నిక్ ద్వారా శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఆల్గొరిథమ్ చెట్ల కొలతను అయిదు రెట్లు వేగంగా కనిపెట్టగలదు. అంతే కాకుండా మరింత కచ్చితంగా ఈ కొలమానం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫారెస్ట్ హెల్త్‌పై స్టడీ చేసే సమయంలో, అడవుల్లో కార్బన్ శాతాన్ని తెలుసుకోవాలనుకునే సమయంలో చెట్ల కొలతను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి సమయాల్లో ఈ ఆల్గరిథమ్ పనిచేస్తుందని వారు భావిస్తున్నారు.


తక్కువ రెసల్యూషన్ ఉన్న లైడార్ సెన్సార్లతో ఈ ఆల్గరిథమ్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ టెక్నాలజీ చాలావరకు మొబైల్ ఫోన్లలో కూడా ఉంటుందని వారు బయటపెట్టారు. దీని ద్వారా రిజల్ట్ మరింత వేగంగా, సరిగ్గా వస్తుందని వారు చెప్తున్నారు. ఇప్పటివరకే చెట్ల చెస్ట్ హైట్ తెలుసుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉండేవి. కానీ కొత్తగా వచ్చిన ఈ టెక్నాలజీతో చెట్ల పూర్తి కొలమానాన్ని తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతే కాకుండా ఇప్పటివరకు ఉన్న పద్ధతుల్లో తప్పులు జరిగే అవకాశం ఉందని వారు అన్నారు.

మామూలుగా అడవుల నుండి ఎంత కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందో తెలుసుకోవడానికి కోసం చెట్లను ఈ విధంగా కొలవడం ఎంతో వినియోగకరం అని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా లైడార్ సెన్సార్స్‌తో కొలతలు తీసుకోవచ్చు.. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకే తక్కువ రెసల్యూషన్ ఉన్న లైడార్ సెన్సార్లను వారు ఉపయోగించి చూశారు. అవి కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీనే మేలు అని ఫిక్స్ అయ్యారు.

లైడార్ సెన్సార్లతో కూడుకున్న యాప్‌ను కూడా పరిశోధకులు తయారు చేశారు. ఆ తర్వాత దానిని యూకే, యూఎస్ కెనడా లాంటి దేశాలలో పరీక్షించి చూశారు. యాప్ సక్సెస్ అయ్యిందని నిర్ధారించారు. అందుకే ఈ యాప్‌ను దాదాపు అన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకురావలని వారు ఆలోచిస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యాప్ లభించేలా చేయాలని వారు అనుకుంటున్నారు. దీంతో చెట్ల కొలతల విషయంలో ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రుడిపై టైమ్ ఎంత..? తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×