Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కోసం కోట్లు ఖర్చు చేసిందెవరు? అసలు తనని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తనకోసం కోట్లు ఖర్చు చేసి మరి టార్గెట్ చేశారని తెగ బాధపడిపోతోంది అమ్మడు. తెలుగులో స్టార్ హీరోలందరితోను కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మకు.. ఇప్పుడు ఇక్కడ ఆఫర్లు రావడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో బాలీవుడ్‌లో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ అక్కడ కూడా సక్సెస్‌లు రావడం లేదు. హిందీలో అమ్మడిని పెద్దగా పట్టించుకునే వారు లేరు. బాలీవుడ్‌లో లక్ చెక్ చేసుకుంటునే.. సౌత్ సినిమాల అవకాశం కోసం ఎదురు చూస్తోంది. కానీ తమిళ్‌లో మాత్రం బంపర్ ఆఫర్స్ అందుకుంటోంది. కోలీవుడ్‌లో ఏకంగా నాలుగైదు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. సూర్య సరసన ‘రెట్రో’ (Retro) సినిమాలో కలిసి నటిస్తున్న బుట్టబొమ్మ.. సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘కూలీ'(Cooli) సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరనుంది. అలాగే.. రాఘవ లారెన్స్ ‘కాంచన 4′(Kanchana)లో దెయ్యంగా ఛాన్స్ అందుకుంది. ఇక దళపతి విజయ్ చివరి సినిమాగా చెబుతున్న ‘జన నాయగన్'(Jana Nayagan) చిత్రంలో పూజనే హీరోయిన్‌గా నటిస్తోంది. రెట్రో సమ్మర్‌లో రిలీజ్ కానుండగా.. జననాయగన్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి పూజా ఆశలన్నీ ఈ సినిమాల పైనే ఉన్నాయి. ఈ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవాలని చూస్తోంది.
కోట్లు డిమాండ్ చేశారు!
ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా పూజా చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న పూజా.. తన జీవితంలో ఎదుర్కొన్ కొన్ని చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద స్టార్స్ అయిన సరే.. ట్రోలింగ్ కామన్ అయిపోయింది. పూజా కూడా ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోయానని చెప్పింది. అందుకోసం కోట్లు రూపాయలు ఖర్చు చేశారని చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు పూజ కోసం అంతలా ఖర్చు చేసిందెవరు? ఆమెను టార్గెట్ చేసిందెవరు? అనేది చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో తన పై జరిగిన ట్రోలింగ్.. తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదనను వ్యక్తం చేసింది బుట్టబొమ్మ. నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టాలని కొందరు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ ట్రోలింగ్స్ చేయించారని తెలిపింది. అంతేకాదు.. ఆ ట్రోలింగ్ ఆపేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేశారని తెలిపింది. అసలు తనపై ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని..కానీ కొంత కాలానికి ట్రోలింగ్స్‌ను పట్టించుకోవడం మానేశానని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదే ఉందని చెప్పుకొచ్చింది. ఇంతకీ పూజను టార్గెట్ చేసింది ఎవరై ఉంటారు?
పూజా సినీ ప్రవేశం
పూజా హెగ్డే తన నటనా జీవితాన్ని 2012లో తమిళ చిత్రం ‘ముగమూడి’తో ప్రారంభించింది. ఈ సూపర్‌హీరో చిత్రంలో ఆమె జీవాతో కలిసి నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ, ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 2014లో తెలుగు సినిమా ‘ఒక లైలా కోసం’సినిమాతో ఆమె తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. నాగ చైతన్యతో జతకట్టిన ఈ చిత్రం టాలీవుడ్‌లో మంచి ఆఫర్లను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోలందరితోను కలిసి నటించింది. కానీ రాధే శ్యామ్ (Radhe Shyam), బీస్ట్ (Beast), ఆచార్య (Acharya) సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో.. ఐరన్ లెగ్ ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటోంది.