School girl chasing bus viral video: ఓ స్కూల్ విద్యార్థిని గవర్నమెంట్ బస్సు, నిర్ణీత స్టాప్ లో ఆగకపోవడంతో ఆ బస్సు వెనుకాల పరిగెత్తిన సంఘటన తమిళనాడులోని తరుపత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆ బస్టాప్ లో బస్సులు ఆగకపోవడంతో ఆమె బోర్డు పరీక్ష రాయడానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడంలో ఆలస్యమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ సంఘటన పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. ఆ విద్యార్థిని ఉదయం 8 గంటల ప్రాంతంలో కొత్తకోట్టై బస్ స్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుంది. విద్యార్థిని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమ్మియంబట్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని తన పరీక్షా కేంద్రానికి వెళ్తేందుకు ఆమె బస్టాప్ లో బస్సు కోసం వేచి ఉంది. అయితే, స్టాప్ వద్ద తిరుపత్తూరు-అలంగాయం ప్రభుత్వ బస్సు ఆగలేదు.. దీంతో బాలిక బస్సు వెనుక పరుగెత్తింది. చివరికి ఆమె ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సు ఎక్కింది.
అయితే, డ్రైవర్ బస్సును కొంత దూరం వెళ్లాక.. ఆలస్యంగా ఆపాడు. దీనికి సంబంధించిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్సు సిబ్బంది నిర్లక్ష్యానికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. దీంతో రవాణా శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులు బస్సు డ్రైవర్ మునిరాజ్‌ను సస్పెండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కండక్టర్ అశోక్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు.
ఈ సంఘటనపై ప్రజలు సోషల్ మీడియా వేదిక నెటిజన్లు సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా ఎగ్జామ్స్ వేళ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్లక్ష్యం మళ్లీ ఎప్పుడూ జరగకుండా చూడాలని.. ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు భిన్న విధాలుగా రియాక్ట్ అయ్యారు. ఓ వ్యక్తి ‘డ్రైవర్ బస్సును ఆపారు. ఇక ఎందుకు చర్య..?. బస్సు ఆపకుండా వెళ్లి ఉంటే, ఏదో కఠిన చర్య తీసుకోవాలి’ అని ఒకరు.. మరొక వ్యక్తి ‘తమిళనాడులో ఇలాంటి సంఘటనలు మాములుగా జరుగుతూనే ఉంటాయి.. స్కూల్ బస్సులు త్వరగా వస్తాయి.. అలాగే మరికొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చి పిల్లలను వదిలివేస్తాయి. ఇతర ప్రాంతాల్లో డ్రైవర్లు చాలా సేపు ఆపుతారు.. వారు వారి ఇష్టమొచ్చినట్టు వాహనాలను నడుపుతారు. వారికి బాధ్యతాయుత భావం లేదు’ అని మరొకరు కామెంట్ చేశారు. మరో వ్యక్తి అయితే ‘స్వాతంత్ర్యం వచ్చినాక దాదాపు 80 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలాంటి సంఘటనలను చూడటం సిగ్గుచేటు’ అని కామెంట్ చేశారు.
అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దీనికి 157.3K వ్యూస్, 2.6K లైక్‌లు వచ్చాయి.
ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..
ALSO READ: ALP JOBS: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది..