BigTV English
Advertisement

Twitter:ఐఓఎస్‌కు ఎంతో.. ఆండ్రాయిడ్‌కూ అంతే!

Twitter:ఐఓఎస్‌కు ఎంతో.. ఆండ్రాయిడ్‌కూ అంతే!

Twitter:ట్విట్టర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమంటూ… ఐఓఎస్ యూజర్ల నుంచి ఇప్పటికే బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు వసూలు చేస్తున్న ఎలాన్ మస్క్… ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల నుంచీ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు వస్తూలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లు బ్లూ టిక్ కోసం నెలకు 11 డాలర్లు చెల్లిస్తుండగా… ఆండ్రాయిడ్ యూజర్లకూ అంతే ధర నిర్ణయించాడు… మస్క్. అంతేకాదు… వెబ్‌ యూజర్ల కోసం యాన్యువల్ ప్లాన్‌ తీసుకొచ్చాడు.


ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి రాకముందు… పొలిటీషియన్లు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, ఇతర ముఖ్యుల ఖాతాలకు… వెరిఫైడ్ బ్లూ టిక్‌ను ఉచితంగానే ఇచ్చేవారు. ఎలాన్‌ మస్క్‌ భారీ ధరకు ట్విట్టర్ కొన్నాక… పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ఆదాయ మార్గాలు వెతికారు. అందులో భాగంగా… ఐఓఎస్‌ యూజర్లకు బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నెలకు 11 డాలర్లు, అలాగే వెబ్‌ యూజర్లకు నెలకు 8 డాలర్లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ యూజర్లకూ ఇవే ధరలు ప్రకటించారు. యాపిల్‌ యాప్‌ స్టోర్‌ తరహాలో గూగుల్‌ ప్లే స్టోర్‌కూ ఆఫ్‌సెట్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉండటంతో… సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు వసూలు చేయక తప్పడం లేదని మస్క్ ప్రకటించాడు.

ఇక వెబ్ యూజర్లు బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ కింద నెలకు 8 డాలర్లు చెల్లిస్తుండగా… కాస్త తక్కువ ధరలో యాన్యువల్ ప్లాన్ ప్రకటించాడు… మస్క్. ఏడాది వ్యవధికి బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం 84 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే… నెలవారీ ఛార్జీలతో పోలిస్తే, యూజర్లకు ఏడాదికి 12 డాలర్లు ఆదా అవుతాయన్న మాట. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లోని వెబ్‌ యూజర్లకు మాత్రమే యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే అవకాశం ఉంది.


ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి… బ్లూ వెరిఫికేషన్‌ మార్క్‌ ఇవ్వడంతో పాటు, లెంగ్తీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలు కల్పించారు. కన్వర్జేషన్‌లో రిప్లై ఇచ్చేటప్పుడు… బ్లూ సబ్‌స్క్రైబర్లకు ప్రాధాన్యం ఇస్తారు. ట్వీట్‌ను ఎడిట్‌ చేసుకోవడంతో పాటు ఐకాన్స్‌ను కస్టమైజ్‌ చేసుకోవడం, థీమ్స్‌ మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×