BigTV English

Master Plans : కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం

Master Plans : కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం

Master Plans : కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్స్ తెలంగాణలో పెనుదుమారం రేపాయి. రైతుల ఆందోళనతో ఈ రెండు పట్టణాలు అట్టుడికాయి. జగిత్యాలలో నలువైపులా రోడ్లను దిగ్భందించి రైతులు నిరసన తెలిపారు. దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం అక్కడకి వెళ్లలేకపోయారు. కామారెడ్డిలో అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అక్కడా రైతులు ఆందోళన చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని పట్టుబట్టారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయో లేక రైతుల ఆవేదన అర్ధం చేసుకున్నారో గానీ ఆ మాస్టర్ ప్లాన్స్ ను కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్స్ రద్దు చేశాయి.


జగిత్యాల మాస్టర్ ఫ్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్లు పాలకవర్గం ప్రకటించింది. ఇక్కడ మాస్టర్ ఫ్లాన్ రద్దు చేయాలని కోరుతూ వారం రోజులుగా 6 గ్రామాల రైతులు, గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. డిసెంబర్ 15న మాస్టర్ ఫ్లాన్ ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. రైతుల నిరసనలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాస్టర్ ఫ్లాన్ సవరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ లో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.

మరోవైపు అత్యవసరంగా సమావేశమైన కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఛైర్ పర్సన్ , వైస్ ఛైర్మన్ తో కలిపి మొత్తం 49 వార్డు కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్లు ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ పై స్పష్టత కోసమే అత్యవసర సమావేశం నిర్వహించామని తెలిపారు. వేరే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. డిజైన్ డెవలప్‌మెంట్‌ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు. రైతులకు అండగా ఉంటామన్నారు. గతంలో రైతుల నుంచి 60 రోజులపాటు అభ్యంతరాలు తీసుకున్నామన్నారు. వాటిని కూడా ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీయల్ జోన్ చేయమన్నారు. రైతులు ఆందోళన విరమించాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జహ్నవి కోరారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×