Big Stories

ISRO News : ఇస్రో ఖాతాలో మరో సక్సెస్.. ఆర్బిట్‌లోకి రెండు సింగపూర్ శాటిలైట్లు..

ISRO News

ISRO News : ప్రస్తుతం ఇండియన్ స్పేస్ టెక్నాలజీపై అభివృద్ధి చెందిన దేశాల దృష్టి సైతం ఉంది కదా. అందుకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో కలిసి పనిచేయడానికి ఎన్నో దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇక్కడ శాటిలైట్ల సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడం, లాంచ్ వెహికల్స్ సామర్థ్యంగా పనిచేయం చూసి సింగపూర్ కూడా తమ శాటిలైట్లను లాంచ్ చేయడానికి ఇస్రో సాయం తీసుకుంది. ఇటీవల వారి దేశానికి చెందిన రెండు శాటిలైట్లు సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయ్యాయి కూడా.

- Advertisement -

ఇస్రోకు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు శాటిలైట్లు ఆర్బిట్‌ను చేరుకున్నాయి. ఇస్రోకు చెందిన కమర్షియల్ సంస్థ న్యూస్పేస్ లిమిటెడ్ ఈ శాటిలైట్లను తయారు చేసింది. చెన్నైకు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ శాటిలైట్ల లాంచ్ జరిగింది. 22.5 గంటల కౌంట్‌డౌన్.. శాటిలైట్లను ఆకాశంలో సక్సెస్‌ఫుల్‌గా ఎగిరిన తర్వాత ఆగిపోయింది. పీఎస్ఎల్వీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన మెషీన్లలో ఇది 57వ మెషీన్ అని ఇస్రో ఛీఫ్ ఎస్ సోమనాథ్ గర్వంగా ప్రకటించారు. పీఎస్ఎల్వీ లాంటి కమర్షియల్ మెషీన్‌ను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదన్నారు.

- Advertisement -

ఇది పూర్తిగా కమర్షియల్ మెషీన్ అని ఇస్రో ప్రకటించింది. పీఎస్ఎల్వీలో ఆర్బిట్‌కు చేరుకున్న శాటిలైట్లలో ముఖ్యమైన శాటిలైట్ టెలోస్ 2. ఇది డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ)తో కలిసి సింగపూర్ ప్రభుత్వం డెవలప్ చేసింది. ఇది శాటిలైట్ ఇమేజెస్‌ను సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఒక సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) పేలోడ్‌ను మోసుకెళ్లింది. ఇది రాత్రి, పగలు వాతావరణాన్ని కనిపెడుతూ కూడా ఉండగలదని వారు తెలిపారు.

టెలోస్ 2తో పాటు అంతరిక్షంలోకి వెళ్లిన మరొక శాటిలైట్ ల్యూమ్‌లైట్ 4. దీనిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోకామ్ రీసెర్చ్ అండ్ శాటిలైట్ టెక్నాలజీతో పాటు రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ డెవలప్ చేశారు. వీఎఫ్‌హెచ్ డేటా ఎక్స్‌ఛేంజ్ సిస్టమ్ కోసం ఈ అడ్వాన్స్ 12యూ శాటిలైట్ అంతరిక్షానికి చేరుకుందని ఇస్రో తెలిపింది. పీఎస్ఎల్వీ లాంచ్ వెహికిల్ అనేది పూర్తిగా శాటిలైట్లను తీసుకెళ్లడం, వాటిని అంతరిక్షంలో వదిలేయడం వంటి వాటికోసమే తయారు చేశామని, ప్రస్తుతం ఇది సక్సెస్‌ఫుల్‌గా శాటిలైట్లను అంతరిక్షంలోకి చేరుస్తుందని ఇస్రో సంతోషం వ్యక్తం చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News