BigTV English

USA support South Korea : సౌత్ కొరియాకు అండగా ఉంటాం: అమెరికా

USA support South Korea : సౌత్ కొరియాకు అండగా ఉంటాం: అమెరికా

USA support South Korea : అమెరికా అన్ని రంగాలలో టాప్ ప్లేస్‌కు చేరుకోవాలని అనుకుంటోంది. దానికోసం ఇతర దేశాలతో చేయి కలపడానికి కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అమెరికా ముందుంది. అయినా కూడా భవిష్యత్తులో రాబోయే పోటీని గ్రహించి మరింత తొందరగా అడుగులు వేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే తాజాగా సౌత్ కొరియాతో కూడా మంతనాలు జరిపింది అమెరికా.


ఏ దేశం అయినా బలంగా ఉండాలంటే.. ముందుగా దాని డిఫెన్స్ సిస్టమ్ బలంగా ఉండాలి. తాజాగా యూఎస్ సెక్రటరీ ఆంటొనీ బ్లింకెన్.. సౌత్ కొరియా సెక్రటరీ పార్క్ జిన్‌తో సమావేశమయ్యారు. సౌత్ కొరియాలోని డిఫెన్స్ సిస్టమ్‌ను మెరుగుపరచడానికి తగిన సాయం చేస్తామని అమెరికా తరపున హామీ ఇచ్చారు. అమెరికా దగ్గర ఉన్న సామర్థ్యాలన్నీ ఉపయోగించి సౌత్ కొరియాకు అండగా నిలబడనుంది.

న్యూక్లియర్, మిస్సైల్ లాంటి వాటిని కూడా సౌత్ కొరియాతో పంచుకోనుంది అమెరికా. ఇప్పటికే యూఎస్‌పై ఎన్నో శత్రు దేశాలు దాడి చేయడం కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి సైన్యానికి ఇది ముందస్తు శిక్షణగా ఉంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా సౌత్ కొరియాపై నార్త్ కొరియా చేసే దాడులను తిప్పికొట్టడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది. అంతే కాకుండా నార్త్ కొరియా న్యూక్లియర్ దాడులను కూడా అమెరికా దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తోంది. దీంతో పాటు అమెరికా, సౌత్ కొరియా కలిసి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్రిమెంట్‌పై కూడా సంతకాలు చేశారు. మరో పదేళ్ల వరకు ఈ డీల్ కొనసాగనుంది.


Follow this link for more details :BIgtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×