BigTV English

AGNIVEER: అగ్నివీరుల నియామక ప్రక్రియలో మార్పు

AGNIVEER: అగ్నివీరుల నియామక ప్రక్రియలో మార్పు

AGNIVEER: రక్షణ దళంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం పోయిన ఏడాది అగ్నిపథ్ అనే కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కీమ్‌లో భాగంగా మొదటి బ్యాచ్ సైన్యంతో కలిసి సేవలందించేందుకు సిద్ధమైంది. తాజాగా అగ్నివీరుల నియామక ప్రక్రియ విధానంను మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


ఇంతకముందు అగ్నివీరుల నియామకానికి మొదటిదశలో శారీరక సామర్థ్య పరీక్షలు, రెండో దశలో వైద్య పరీక్షలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషణ్(సీఈఈ) నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ పద్ధతిలో మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై మొదటి దశలో ఆన్‌లైన్ సీఈఈ పరీక్ష నిర్వహించి.. ఆ తర్వాత శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. శారీరక సమార్థ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే ర్యాలీలకు అభ్యర్థులు భారీసంఖ్యలో హాజరవుతున్నారని.. రద్దీని నియంత్రిస్తూ నియామక విధానాన్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో జారీ చేయనున్న నియామక ప్రక్రియను కొత్త విధానంలో అమలు చేయనున్నట్లు తెలిపారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×