BigTV English

Viagra for woman : మహిళలు వయాగ్రా తీసుకోవచ్చా?.. తీసుకుంటే ఏమౌతుంది..!

Viagra for woman : నేటి కాలంలో చాలా మంది మహిళలు తక్కువ సెక్స్ డ్రైవ్‌ను అనుభవిస్తున్నారు. గర్భం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి తదితర కారణాల వల్ల సెక్స్‌లో కాస్త వెనుకబడిపోతున్నారు. బలహీనమైన ఆరోగ్యం, వయసు సంబంధిత ఇతర కారణాలు కూడా సెక్స్ డ్రైవ్‌ను తగ్గించొచ్చు. వయాగ్రాను పురుషుల్లో సెక్స్ డ్రైవ్ పెంచడానికి తీసుకుంటారు. ఇది మహిళల్లో ఎలా పని చేస్తుందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Viagra for woman : మహిళలు వయాగ్రా తీసుకోవచ్చా?.. తీసుకుంటే ఏమౌతుంది..!

Viagra for woman :


నేటి కాలంలో చాలా మంది మహిళలు తక్కువ సెక్స్ డ్రైవ్‌ను అనుభవిస్తున్నారు. గర్భం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి తదితర కారణాల వల్ల సెక్స్‌లో కాస్త వెనుకబడిపోతున్నారు. బలహీనమైన ఆరోగ్యం, వయసు సంబంధిత ఇతర కారణాలు కూడా సెక్స్ డ్రైవ్‌ను తగ్గించొచ్చు. వయాగ్రాను పురుషుల్లో సె*క్స్ డ్రైవ్ పెంచడానికి తీసుకుంటారు. ఇది మహిళల్లో ఎలా పని చేస్తుందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

తక్కువ సె*క్స్ డ్రైవ్ అంటే..?


డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్టర్ ప్రకారం.. DSM-5 ఫిఫ్త్ ఎడిషన్, స్త్రీ లైంగిక ఆసక్తి FSIAD అనేది ఒక వైద్యపరమైన డిజార్డర్. ఈ సమస్య కారణంగా స్త్రీలు సెక్స్‌పై ఆసక్తి కోల్పోతారు. ఈ డిజార్డర్ వల్ల ఇంద్రియపరమైన ఆలోచనలు, లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి తగ్గిపోతుంది. ఆనందం కోల్పోతారు. ఈ లక్షణాలు మహిళల్లో గణనీయమైన బాధను కలిగిస్తాయి. సె*క్స్ సమస్యలు తలెత్తుతాయి.

వయాగ్రా ఎప్పుడూ పురుషులకు సె*క్స్ పరంగా ఫలితాలు చూపిస్తుంది. పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. రక్తనాళాలలను విస్తరింపజేస్తుంది. పురుషులలో అంగస్తంభనను సులభతరం చేస్తుంది. ఇది పురుషులు లైంగిక పనితీరును మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. స్త్రీలలో ఉద్రేకాన్ని నేరుగా పరిక్షించదు.

అందువల్లనే లైంగిక బలహీనత ఉన్న మహిళలకు వయాగ్రా ఎంత మేలు చేస్తుందో చెప్పడానికి సమాధానం లేదు. ఇది జననేంద్రీయ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సున్నితత్వం, ఉద్రేకం, క్లైమాక్స్ చేరుకునే సామార్థ్యాన్ని పెంచుతుంది. ఇది మహిళల్లో ఎలా పనిచేస్తుందనే దానికి పరిశోధన అవసరం.

Flibanserin అనే ఔషధాన్ని ఫిమేల్ వయాగ్రా లేదా పింక్ పిల్ అంటారు. ఇది మహిళల్లోని తక్కువ సె*క్స్ డ్రైవ్‌కు తీసుకోబడింది. ఈ ఔషదాన్ని 2015లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఆమోదించింది. వయాగ్రా పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలకు, ప్రత్యేకంగా స్త్రీ లైంగిక ఆసక్తి నష్టం చికిత్సకు తీసుకోబడుతుంది. ఒత్తిడి లేదా వయసు సంబంధిత రకరకాల సమస్యలకు ఈ ఔషదం తీసుకోకూడదు.

ఈ ఔషదం ఉపయోగించడం వల్ల తల తిరగడం, మైకం, నిద్రలేమి, వికారం, శారీరక అలసట వంటి సమస్యలు వస్తాయి. మహిళలు వయాగ్రా తీసుకోవడంపై ఎటువంటి స్థిరమైన మోతాదు నిర్ణయించబడలేదు. సె*క్స్ సమస్యతో బాధపడుతున్న మహిళలు నిపుణులను సంప్రదించాలి. ఈ సమస్య వెనుక కొన్ని కారణాలు ఉండవచ్చు. నిర్లక్ష్యం చేసినట్లయితే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

Note : మీరు వైద్య నిపుణులతో మీ సె*క్స్ సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు ఓపెన్‌గా ఉండండి. నిజాయితీగా మీ సమస్యలు పంచుకోండి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×