BigTV English

Village godess : లహువా దేవతకి పూజ చేయాలంటే నగ్నంగా ఉండాలా…?

Village godess : లహువా దేవతకి పూజ చేయాలంటే నగ్నంగా ఉండాలా…?

Village godess : మనదేశంలో దేవుళ్లకి, ఆచారాలకు కొదవలేదు. రాయిలోను దేవుడ్ని చూసే భక్తి మన వారిలో కనిపిస్తుంది. నగ్నత్వం అనేది త‌ప్పుగా భావిస్తారు. పిని గ్రామానికి చెందిన ప్రజలరి ఆచారం ప్రకారం.. అక్కడి మహిళలు ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. ప్రతి రోజు నగ్నంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే అలా ఉండాలి.


కొత్తగా పెళ్లయిన వధువు సైతం.. ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. ఆ 5 రోజులు భర్తకు దూరంగా ఉండాలి. వారు న‌గ్నంగా ఉన్న ఐదు రోజులు ఇంట్లో ఎవరూ కనీసం నవ్వకూడదు. నగ్నంగా ఉన్న ఐదు రోజులు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లరు. అలాగే బయట వ్యక్తులు కూడా వారిని చూడకూడదు. దానివల్ల వారు నగ్నంగా ఉన్నా.. ఎలాంటి భయం లేకుండా గడుపుతారు.

గ్రామంలోని మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే వారి ఇంట్లో అశుభం కలుగుతుందని, చెడు వార్త వినాల్సి వస్తుందని భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఒక కథ కూడా ఉంది. ఒకప్పుడు ఒక‌ రాక్షసుడు పిని గ్రామాన్ని పీడించేవాడు. దుస్తులు ధరించిన అందమైన వివాహిత మహిళలను ఎత్తుకుపోయేవాడు. దీంతో అక్కడి మహిళలు దుస్తులు విప్పేసి.. రక్షించాలని దేవతలను వేడుకున్నారు. వారి మొర అలగించిన దేవతలు ఆ రాక్షసుడిని సంహరించి.. గ్రామ మహిళలను రక్షించారు. అప్పటి నుంచి అక్కడి మహిళలు ఏడాదిలో ఐదు రోజులు నగ్నంగా ఉంటున్నారు. ఆ ఐదు రోజులు వారు బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు. పురుషులే కాదు.. స్త్రీలు కూడా వారిని చూడరు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు లహువా దేవతకు పూజలు చేస్తారు.


Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×