BigTV English
Advertisement

Credit Score : క్రెడిట్ స్కోరుపై ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుందంటే..

Credit Score : క్రెడిట్ స్కోరుపై ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుందంటే..

Credit Score : బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే.. ముఖ్యంగా కావాల్సింది… సిబిల్ స్కోరు. దీన్నే క్రెడిట్ స్కోర్ అంటారు. ఇప్పుడు సిబిల్ తో పాటు చాలా సంస్థలు క్రెడిట్ స్కోరు ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ల విషయంలో క్రెడిట్ స్కోరుకే ప్రాధాన్యత ఎక్కువ. ఓ వ్యక్తి రుణ చరిత్ర మొత్తం… క్రెడిట్ స్కోరుతో తెలిసిపోతుంది. అది ఎంత ఎక్కువగా ఉంటే… క్రెడిట్ హిస్టరీ అంత బాగా ఉందని అర్థం. నెల నెలా గడువులోగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే వ్యక్తికి… బ్యాంకులు తొందరగా అప్పు ఇస్తాయి. ఎందుకంటే… గడువులోగా తీర్చేస్తాడనే నమ్మకం… క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది కాబట్టి.


అప్పు కోసం ప్రయత్నించిన ప్రతిసారీ క్రెడిట్‌ స్కోరు తగ్గుతుందేమోనని కొందరు భయపడుతుంటారు. ఇది కొంతవరకు నిజమే అయినా… అన్ని సందర్భాల్లో కాదు. క్రెడిట్‌ స్కోరును రెండు విధాలుగా పరిశీలిస్తారు. ఒకటి సాఫ్ట్‌ ఎంక్వైరీ, రెండోది హార్డ్‌ ఎంక్వైరీ. ఓ వ్యక్తి క్రెడిట్ స్కోరును సొంతంగా చెక్ చేసుకున్నా… లేదా… ఆర్థిక సంస్థలు చెక్ చేసినా… దాన్ని సాఫ్ట్‌ ఎంక్వైరీ అంటారు. ఇవి ఎన్నిసార్లు చెక్ చేసినా క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడదు. ఓ సంస్థ తన ఉద్యోగి క్రెడిట్‌ స్కోరును పరిశీలించినా అది సాఫ్ట్‌ ఎంక్వైరీ కిందికే వస్తుంది. ఇక అప్పు ఇచ్చే బ్యాంకులు, సంస్థలు… క్రెడిట్‌ నివేదికల కోసం అభ్యర్థిస్తే… దాన్ని హార్డ్‌ ఎంక్వైరీ అంటారు. ఇలాంటి విచారణలతో క్రెడిట్‌ స్కోరు కొంత తగ్గుతుంది. ఎంత తగ్గుతుందనేది… ఆ వ్యక్తి ప్రస్తుత క్రెడిట్‌ స్కోరు, క్రెడిట్ హిస్టరీ, హార్డ్‌ ఎంక్వైరీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. రుణం మంజూరయ్యే పరిస్థితి లేకపోయినా… ఎక్కువగా హార్డ్ ఎంక్వైరీలు వస్తే… ఆ వ్యక్తి ద్వారా నష్ట భయం పెరిగిందని, క్రెడిట్‌ బ్యూరో సంస్థలు స్కోరును తగ్గిస్తాయి. ఒక్కో ఎంక్వైరీపై 3 నుంచి 10 పాయింట్ల దాకా స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది.

క్రెడిట్‌ స్కోరు తగ్గకూడదంటే.. నిజంగా అప్పు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా అన్ని బ్యాంకుల్లో కాకుండా… తక్కువ వడ్డీ రేటుకు అప్పు ఇచ్చే బ్యాంకులు ఏవి ఉన్నాయని ఆరా తీసి… దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, క్రెడిట్‌ కార్డుల కోసం వివిధ బ్యాంకులకు ఒకేసారి దరఖాస్తు చేస్తే… క్రెడిట్‌ స్కోరు బాగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి… మీ అవసరానికి తగ్గట్టుగా ఉండే క్రెడిట్ కార్డు కోసం పరిశోధించి… దానికే దరఖాస్తు చేసుకుంటే… క్రెడిట్ స్కోరు తగ్గదు. ప్రీ అప్రూవ్డ్ లోన్స్, క్రెడిట్‌ కార్డులకు క్రెడిట్‌ స్కోరు తగ్గదు. కానీ దరఖాస్తు చేస్తే మాత్రం క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది.


Tags

Related News

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Big Stories

×