BigTV English

Narada Lake : నారద సరస్సు ఉన్న గుడి ఎక్కడుంది…?

Narada Lake : నారద సరస్సు ఉన్న గుడి ఎక్కడుంది…?

నారద మహర్షి స్త్రీ రూపం పొందిన ప్రాంతం సర్పవరం. తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరానికి ఒక ప్రత్యేకత ఉంది. నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందిన ప్రదేశమే సర్పవరంగా స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది.ఇక్కడ మూలభావనారాయణ స్వామి .. రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు.


పూర్వం నారదుడు .. విష్ణుమాయను తాను తప్ప ఎవరూ తెలుసుకోలేరు అనే అహంభావానికి లోనయ్యాడట. దేవతల సభలో ఆ మాటను చెబుతాడు. ఈ విషయం విష్ణుమూర్తి కి తెలుస్తుంది. ఆ తరువాత నారదుడు భూలోక సంచారం చేస్తూ ఇప్పుడు సర్పవరంగా చెప్పబడుతున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఒక కొలను కనిపించడంతో అందులో స్నానం చేయడానికి దిగుతాడు. ఆ కొలనులో మూడు మార్లు మునిగి పైకి లేవగానే ఆయన స్త్రీ రూపాన్ని పొందుతాడు. కొలను గట్టున పెట్టిన వీణ .. చిడతలు మాయమవుతాయి.

నారద స్త్రీ గతాన్ని మరిచిపోతుంది .. తాను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకి గుర్తుండదు. అప్పుడు పిఠాపురాన్ని ఏలుతున్న నికుంఠ మహారాజు గుర్రంపై ఎదురవుతాడు. నారద స్త్రీ ఒంటరిగా సంచరించడం చూసి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఆమెకి ఎవరూ లేరని తెలుసుకున్న రాజు, ఆమెను వివాహం చేసుకుంటాడు. వాళ్లకి 60 మంది సంతానం కలుగుతారు. ఆ తరువాత కొంతకాలానికి నికుంఠ మహారాజుతో పాటు ఆ సంతానం అంతా కూడా శత్రు రాజుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు.


నారదుడు ముందుగా స్నాన మాచరించి స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు నారద సరస్సుగా .. స్త్రీ రూపం నుంచి ముక్తిని పొందిన సరస్సు ముక్తికా సరస్సు గా పిలవబడుతూ నేటికీ ఆలయానికి ఎదురుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇటు చారిత్రక ఘనత .. అటు ఆధ్యాత్మిక వైభవం కలిగిన ఈ క్షేత్రం దర్శనం చేతనే ధన్యులను చేస్తుంది. ప్రతి సంవత్సరం మాఘ ఆదివారాలలో ఇక్కడ తీర్థం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కాకినాడకి అత్యంత సమీపంలో ఉండటం వల్ల అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా తేలిక.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×