Big Stories

Karma yoga : కర్మ యోగి ఎవరు?

Karma yoga : నీ కర్మ నిర్వహణలో మోసం, పాపం, ఉండకూడదు.కర్మయోగులకు ఫలితాసక్తి ఉండదు.విధి నియమాన్ని అంగీకరించి కర్తవ్య కార్యాన్ని ముందుకు నడిపించడమే ప్రధాన ఆశయం. దేవుడి ఆజ్ఞగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఆదమరుపుగానైనా నీ కర్తవ్యానికి నీవు భంగం కలిగించకూడదు. అప్పుడు మాత్రమే నువ్వు కర్మ ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తావు. ధర్మపూర్వకంగా చేసే కర్మకు పాప పుణ్యాల ప్రస్తావన ఉండదు.

- Advertisement -

మహాభారతంలో భీష్మాచార్యుడు కర్మయోగి. కర్మయోగానికి ఫ్రతిరూపమే భీష్ముడు అని చెప్పవచ్చు. ఎందకుంటే పాండువుల మీద ఆయనకు అభిమానం ఉంది. పాండవులు ధర్మమూర్తులనీ తెలుసు. కౌరవుల దుర్మదం వల్లే కురక్షేత్ర యుద్ధం జరుగుతున్నదనీ తెలుసు . కానీ కర్మయోగి కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మినోడు కాబట్టి కౌరవులకు సేనాధిపతిగా ఉండి ధర్మపరులైన పాండవులతో యుద్ధం చేశాడు.

- Advertisement -

యుద్ధంలో తనకు శిఖండి ద్వారా మరణం తప్పదని భీష్ముడికి తెలుసు . విజయం పాండవులకే దక్కుతుందన్న విజయం తెలుసు. శ్రీకృష్ణుడి రక్షణ పాండువులకే ఉన్నదని, తెలుసు. ఇన్ని తెలిసి ఉండి కూడా కర్మపాలన కోసమే పాండవ వీరులతో యుద్ధం చేశాడు భీష్ముడు.

ధర్మపాలన కృష్ణుని మతమైతే, కర్మ పాలన భీష్ముని మతం. విధివాత్రను మనం కర్మ అంటాం. కర్తవ్యాన్ని విస్మరించి విధి రాత అనుకుంటూ కూర్చోవడం కర్మయోగం కాదు. కష్టాలకు కుంగిపోకుండా సుఖాలకు పొంగిపోకుండా తన కర్తవ్య కార్యాన్ని విడవకుండా జీవితాన్ని సాగించటమే కర్మయోగం. చిన్న చిన్న సమస్యలకే చిందర వందర అయ్యే వారికీ ఉద్వేగంతో చలించి పోయే వారికి కర్మయోగం సాధ్యం కాదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News