Big Stories

Harish Rao : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌: హరీష్ రావు

Share this post with your friends

Harish Rao : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో గ్రూప్‌ – 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేటలో పర్యటించిన హారీష్ రావు.. కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్నవారికి పాలు, పండ్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 17వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వివరించారు. పోలీసుశాఖలో మరో 2 వేల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మోదీ సర్కార్ అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని విమర్శించారు. యువత జీవితాల్ని నాశనం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News