BigTV English

Kaala Dosham : కాల దోషం అంటని శివుడు

Kaala Dosham : కాల దోషం అంటని శివుడు

Kaala Dosham : ఈ విశ్వంలో సృష్టించబడినది ఏదైనా కాలక్రమంలో నశించక తప్పదు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. జీవులైనా, రాక్షసులైనా , పశుపక్ష్యాదులైనా, దేవతాలైనా మృత్యువును ఎదుర్కోవాల్సిందే. కాలంలో కనుమరుగుకాక తప్పదు. ఇదే విధంగా ఇంద్రుడైనా, బ్రహ్మ విష్ణువులైనా, రుద్ర మహేశ్వరుడైనా కాలంలో కనుమరుగుకాక తప్పదు. కానికాలంలో కనుమరుగుగాని దైవం ఒక్క శివుడే.


సర్వాన్ని నాశనం చేసే కాలం, ఒక్క శివుడ్ని మాత్రం ఏమీ చేయలేదు. అంతేకాక కాలాన్ని కూడా నాశనం చేసే మహాదైవం శివుడే. అందుకే శివుడికి మహాకాలుడని, కాలకాలుడని పేరు . విష్ణువుకి ఒక దినం పూర్తికాగానే బ్రహ్మదేవుడు కనుమరుగవుతాడు. రుద్రునికి ఒక దినం పూర్తికాగానే విష్ణువు కనుమరుగవుతాడు. ఈవిధంగా శివుడు తప్ప అందరూ కనుమరుగయ్యే వారే. పద్మపురాణం, బ్రహ్మ విష్ణువుల ఆయుష్షు లెక్కలు చెప్పింది.

ఇంద్రుడి ఆయుష్షు 68.57 కోట్ల సంవత్సరాలు
బ్రహ్మ ఆయుష్షు 5 లక్షల 40వేల ఇంద్రుల కాలం
విష్ణువు ఆయుష్షు శత బ్రహ్మల జీవితకాలం
మహేశ్వరుడి ఆయుష్షు శతరుద్రుల జీవితకాలం


పరమశివుడు శాశ్వతః అని శివుని అష్టోతరశత నామాలతో విష్ణువునే మెచ్చుకున్నాడు. కాబట్టి కాలంతో సంబంధం లేని కాలాతీత ఏకైకే దేవుడు శివుడే.

Tags

Related News

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Ganesh Chaturthi 2025: వినాయకుడిని 21 పత్రాలతోనే.. ఎందుకు పూజించాలి ?

Mangalwar Ke Upay: చెడు దృష్టి పోవాలంటే.. మంగళవారం ఈ పరిహారాలు చేయండి చాలు !

Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి లడ్డూ ప్రసాదం.. సింపుల్ రెమెడీ.. తింటే వావ్ అనాల్సిందే

Birthday Celebrations: పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో తెలుసా..? మీరు అసలు ఆ తప్పు చేయకండి

Big Stories

×