E-Paper
Advertisement

Prices of Petrol and Diesel:పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదంటే..

Prices of Petrol and Diesel:పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదంటే..
Advertisement

Prices of Petrol and Diesel:అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా తగ్గింది. అయినా… దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. గత 9 నెలలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత ఏప్రిల్ వరకూ రోజూ అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించిన కంపెనీలు… ఆ తర్వాత ముడి చమురు ధర భారీగా పెరగడంతో… ఆ భారాన్ని వినియోగదారులపై వేయలేదు. ఆ నష్టాలను… చమురు ధరలు తగ్గినప్పుడల్లా పూడ్చుకుంటూ వస్తున్నాయి. అందుకే… గత 9 నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు… తగ్గడం లేదు.

ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 లాభం పొందుతున్న కంపెనీలు… డీజిల్‌పై మాత్రం రూ.6.5 నష్టపోతున్నాయి. 2022 జూన్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 17.4, లీటర్‌ డీజిల్‌పై రూ. 27.7 నష్టపోయిన కంపెనీలు… ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు క్రమంగా తగ్గడంతో… అక్టోబరు, డిసెంబరు మధ్య కాలంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 10 లాభం పొందాయి. లీటర్‌ డీజిల్‌పై నష్టాన్ని రూ. 6.5కు తగ్గించుకోగలిగాయి.

Advertisement

గత ఏప్రిల్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధర 102.97 డాలర్ల నుంచి 116.01 డాలర్లకు పెరిగింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచకుండా… కంపెనీలే నష్టపోయాయి. ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య మూడు ప్రభుత్వరంగ చమురు సంస్థలు రూ. 21,201.18 కోట్లు నష్టపోయాయి. ప్రభుత్వం రూ.22,000 కోట్లు సాయం చేయడంతో… ఆ మాత్రం నష్టాలతో బయటపడ్డాయి. ఆ తర్వాత జూన్‌లో ముడిచమురు ధర 78 డాలర్లకు పడిపోయినా… పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించకుండా గతంలో వచ్చిన నష్టాల్ని పూడ్చుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా 140 డాలర్లకు చేరిన బ్యారెల్ ముడిచమురు ధర… చైనాలో గిరాకీ మందగించి క్రమంగా తగ్గుతూరావడం… ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కలిసొచ్చింది. నష్టాల నుంచి బయటపడేలా చేసింది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×