Death Anniversary : ఒక వ్యక్తి మరణించిన తర్వాత 365 రోజులకి మళ్లీ ఆ తిథి వచ్చినప్పుడు సంవత్సరీకం పూర్తవుతుంది. సంవత్సరీకం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. సంవత్సరీకం అయిపోయిన తర్వాత తద్దినాలు మాత్రమే పెట్టాలి. అందుకే ప్రతీ సంవత్సరం పెట్టేదానిని ఆబ్దీకము అంటారు.
తద్దినం పెట్టేటప్పుడు ఆ వ్యక్తి తండ్రి,తాత, ముత్తాత వరకు గణన తీసుకుంటారు. తద్దినం పెట్టే వ్యక్తి చనిపోతే పైన చెప్పిన వారిలో ముత్తాత స్వరూపం పోయి ఆ స్థానంలోకి మరొకరు జరుగుతారు. కాబట్టి మనం ఎన్ని రోజులు బతికి ఉంటామో అన్ని రోజులూ ఆబ్ధికం జరిపిస్తూనే ఉండాలి.
మనకు జన్మనిచ్చినవారిని సంవత్సరానికోసారైనా తలచుకోవడం కొడుకుల బాధ్యత. అలా తలచుకోవడం పుణ్యప్రదం, జన్మనిచ్చి, పోషించి, పెంచి, తప్పటడుగులు దగ్గర నుంచి తప్పు అడుగుల వరకు సరిదిద్ది, విద్యాబుద్దులు నేర్పించి మనల్ని మనుషులుగా సమాజంలో నిలబెట్టిన తల్లిదండ్రులు మరణించిన తర్వాత శ్రాద్ధకర్మలు తప్పనిసరిగా చేయాలా అని అడిగితే సమాధానం ఏం చెప్పాలి.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు ప్రతీ సంవత్సరూ తిథుల ప్రకారం సంవత్సరీకాలు పెడుతుంటూరు. శూద్రవర్ణం వారందరూ ఎక్కువగా సంక్రాంతికి పెద్దలను స్మరించుకుని బట్టలు పెడుతుంటారు. పెద్దల పేరు మీద దానధర్మాలు చేస్తుంటారు. ఇది మన సంప్రదాయం. సంక్రాంతికే పెద్దలను స్మరించుకోవడం వెనుక ఒక ప్రత్యేకత కూడా ఉంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిది పుష్య మాసంలోనే. కాబట్టి ఉత్తరాయాణ, పుణ్యకాలం కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. కనుకు ఇప్పుడే స్వర్గద్వారాలు తెరుస్తారనీ.. ఈ పుణ్యకాలంలో మరణించిన వారికీ స్వర్గ ప్రాప్తి కలుగుతుందని, హిందువుల విశ్వాసం, స్వర్గద్వారాలు తెరిచే సమయంలోనే సంక్రాంతి వస్తుంది. కాబట్టి భోగినాడు పితృదేవతలను పూజించే సంప్రదాయ వచ్చింది.