BigTV English

Fits Problem : ఫిట్స్ వచ్చినప్పుడు నురగ ఎందుకు వస్తుందంటే..!

Fits Problem : ఫిట్స్ వచ్చినప్పుడు నురగ ఎందుకు వస్తుందంటే..!

Fits Problem : ఫిట్స్.. ఇది చాలా అరుదైన వ్యాధి. దీనిని మూర్చ వ్యాధి అని కూడా అంటారు. ఇది ఎక్కడో ఒకరికి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఇది ఎప్పడు ఎలా ఎటాక్ చేస్తుందో చెప్పలేము. సాధ్యమైనంత వరకు అలర్ట్‌గా ఉండి ప్రాణాలు కాపాడుకోవచ్చు. నరాల వీక్‌నెస్ ఉన్నవారు ఎక్కువగా ఫిట్స్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఫిట్స్ సమయంలో స్పృహ ఉండదు. పట్టుతప్పి నేలపై పడిపోతాం. ఫిట్స్ వచ్చినప్పుడు కనిపించే మరో లక్షణం నోటి వెంట నురగ రావడం. ఈ వ్యాధి కొందరికి రెగ్యులర్‌గా వస్తుంది. మరికొందరిలో అప్పుడప్పుడు మాత్రమే వస్తుందట.


ఫిట్స్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేల మీద పడినప్పుడు ప్రతి ఒక్కరు ప్రాణం పోయినట్లుగా టెన్షన్ పడతారు. నోటిలో నుంచి నురగ కూడా వస్తుంది. కానీ ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. నోటి నుంచి వచ్చే నురగను చూసి కంగారు పడకూడదు. ఆ నురగ ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి.

సాధారణంగా నోటిలో ఊరే లాలాజలం గుటక వేయడం ద్వారా కడుపులోకి వెళుతుంది. ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం లాలాజలం నోటి నుంచి బయటకు వెళుతుంది. ఇదే సమయంలో ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి లాలాజలంతో కలిసి బుడగలను సృష్టిస్తుంది. అందుకే ఫిట్స్ వచ్చినప్పుడు బుడగలతో కూడిన నురగ నోటి లోపల నుంచి వస్తుంది.


ఇది చూడటానికి ప్రమాదంగా ఉంటుంది. కానీ పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. సరైన సమయానికి చికిత్స చాలా అవసరమని గుర్తుంచుకోండి.

ఈ వ్యాధిని వైద్య భాషలో సైజుర్స్, ఎపిలెన్సి అంటారు. దీనికి వ్యాధికి కారణాలు అనేకం ఉన్నాయి. శరీరంలోని చక్కెరలో హెచ్చుతగ్గులు, మెదడులో కణిత ఏర్పడటం, తలకు బలమైన గాయం, అల్జిమర్స్ వ్యాధి,అధిక ఒత్తిడి, నరాల సంబంధిత సమస్యలు ఉన్నా కూడి ఫిట్స్ వస్తుంది. మనలో ఫిడ్స్ రాకుండా అడ్డుకేనే థ్రెష్ హోల్డ్ అనే యంత్రాంగం ఉంటుంది. ఈ థ్రెష్ హోల్డ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×