E-Paper
Advertisement

Sankranthi Muggulu:సంక్రాంతి ముగ్గు బియ్యప్పు పిండితోనే ఎందుకు వేయాలి

Sankranthi Muggulu:సంక్రాంతి ముగ్గు బియ్యప్పు పిండితోనే ఎందుకు వేయాలి
Advertisement

Sankranthi Muggulu:సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్ల ముత్యాల ముగ్గులతో కళకళలాడుతుంటాయి. రంగు రంగు ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెడుతూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హిందువుల లోగిళ్లలోనూ ప్రాంగణాలోలనూ అలికి ముగ్గులు పెట్టడం తరతరాలుగు ఉన్నదే. సంక్రాంతికి గొబ్బెమ్మలు, పూలు.. ఇలా రమణీయంగా వుంటాయి ఇళ్లు ముంగిళ్లు. ఇలా ముగ్గులు వేయడానికి కారణం వుంది. మన భూమికి దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం నుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీనులు చెప్పారు. దక్షిణ దిక్కు యముడి దిక్కు భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు ఎప్పుడూ తిరుగుతూనే వుంటాయి.అవి ఇంట్లోకి ప్రవేశించకుండా వాకిలి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయాలి. ఇంట్లోకి వద్దామని వచ్చిన పిశాచం బియ్యపు పిండి తింటూ ఆ ముగ్గులోనే వుండిపోతుందని విశ్వాసం.

అందుకోసమే అప్పట్లో బియ్యపు పిండితో ముగ్గులు వేసే వారు. రాను రాను ప్రస్తుత కాలంలో రాళ్ల పిండితో ముగ్గులను వేస్తూ ఉండడం మొదలుపెట్టాం. బియ్యపు పిండితో ముగ్గులు పిశాచులు, రాక్షసుల నుంచి విముక్తి పొందడం కోసమే అని పండితులు చెబుతున్నారు. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి

Advertisement

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గు లలో కూడా మనకు తెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!… యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×