E-Paper
Advertisement

Animal Transmitted Diseases : అడవి పందులు, కోతుల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి..

Animal Transmitted Diseases : అడవి పందులు, కోతుల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి..
Advertisement
Animal Transmitted Diseases

Animal Transmitted Diseases : జంతువులకు కూడా ఈ భూగ్రహంపై సమాన హక్క ఉందని, వాటికి కూడా బ్రతికే అవకాశం ఇవ్వాలని ఎంతోమంది యానిమల్ లవర్స్ పోరాడుతూ ఉంటారు. కానీ కొన్ని జంతువుల వల్ల మనుషులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సైతం హెచ్చరిస్తుంటారు. తాజాగా పెట్ డాగ్స్ వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపిన వారు.. తాజాగా మరో రెండు రకాల జంతువుల వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తుతాయని బయటపెట్టారు.

Advertisement

సౌత్ ఈస్ట్ ఏషియా వ్యాప్తంగా అడవి పందులు, కోతులు లాంటి వాటి వల్ల వివిధ రకాల వ్యాధులు సంభవిస్తున్నాయని ఒక పరిశోధనలో తేలింది. అది తెలుసుకోవడం కోసమే ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల జంతువుల గురించి సమాచారాన్ని కలెక్ట్ చేశారు. కెమెరాలతో వాటి ఫోటోలను కూడా తీశారు. అసలు ఏ జంతువుల సంఖ్య ఎంత ఉంది అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే చాలావరకు అడవి ప్రాంతాల్లో అడవి పందులు, కోతుల సంఖ్య పెరిగిపోతోందని వారు తెలుసుకున్నారు.

అడవి పందులు, కోతుల సంఖ్య పెరగడానికి మనుషులే కారణమవుతున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అడవులను ఆ జంతువులు జీవించడానికి సౌకర్యంగా మారుస్తున్నారు కాబట్టే వాటి సంఖ్య పెరుగుతోందని భావిస్తున్నారు. ప్లాంటేషన్స్ వాటివి ఏర్పాటు చేయడం వల్ల కోతుల సంఖ్య 400 శాతం పెరిగినట్టుగా వారు గుర్తించారు. మామూలు అడవుల్లో కంటే ప్లాంటేషన్స్ లాంటి వాటిలో కోతులు ఎక్కువగా నివసించడానికి ఇష్టపడుతున్నాయని, అందుకే అక్కడే వాటి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోందని అన్నారు.

Advertisement

కెమెరాలతో క్యాప్చర్ చేయడం ద్వారా ఈ జంతువుల ప్రవర్తన గురించి శాస్త్రవేత్తలు పూర్తిగా స్టడీ చేయడం మొదలుపెట్టారు. ప్రత్యేకంగా అడవి పందులు, కోతులు లాంటి వాటి సంఖ్య పెరగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. ఎలాంటి వ్యాధులు వస్తాయని క్లారిటీ లేకపోయినా.. కచ్చితంగా కోవిడ్ 19 లాంటి మహమ్మారి కూడా వీటి వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలా ఏర్పడిన వ్యాధిని వ్యాప్తి చేయడంలో ఈ రెండు జంతువులు కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే వీటిని వేర్వేరు ప్రాంతాలకు తరలించడం లేదా ఒక సేఫ్ ఏరియాలో వాటికి నివాసం కల్పించడం లాంటివి చేయడం గురించి వారు ఆలోచించడం మొదలుపెట్టారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×