Big Stories

Wildfire : కార్చిచ్చులను కంట్రోల్ చేసే టెక్నాలజీ.. సెన్సార్ల సాయంతో..

Wildfire : ఒక చిన్న మంట చాలు.. అడవిని అయినా తగలేయడానికి.. అని చెప్తుంటారు. అందుకే అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు. అయినా దట్టంగా ఉన్న అడవులను ఎప్పుడూ కనిపెడుతూ ఉండడం కష్టంగా ఉండడం వల్ల కార్చిచ్చు అనేది ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాటిని కనిపెట్టడం కోసమే శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ముందుగా అమెరికాలో ఈ ప్రయోగం ప్రారంభం కానుంది.

- Advertisement -

ఇప్పటికే అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో సైతం కార్చిచ్చుల వల్ల ఎన్నో అడవులు కాలిపోయాయి. ఒక్కొక్కసారి ఎన్నో ఎకరాల వరకు అడవులు కాలిపోయి బూడిద అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే కార్చిచ్చులను కనిపెట్టడం కోసం సెన్సార్లు ఏర్పాటు చేయాలని అమెరికా శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. అమెరికాలోని ఓక్‌ల్యాండ్ అడవిలో ముందుగా ఈ సెన్సార్లను ఏర్పాటు చేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. 1991లో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ఈ అడవిని ప్రయోగం కోసం ఎంపిక చేసుకున్నట్టు వారు తెలిపారు.

- Advertisement -

ఓక్‌ల్యాండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ముందుగా ఈ సెన్సార్లను ఏర్పాటు చేయడంలో సహాయపడింది. ఈ సెన్సార్ల సాయంతో అయినా అడవులను కాపాడుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత మరిన్ని టెక్నాలజీల సాయంతో అడవులను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తామన్నారు. ఒక్కొక్కసారి కార్చిచ్చు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటివి నివారించడానికి కూడా ఈ సెన్సార్లు ఉపయోగకరంగా ఉంటాన్నారు.

ఎన్5షీల్డ్ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది ఓక్‌ల్యాండ్. ఇది ఏ ఏడాదిలోనే అప్రూవ్ అయ్యి.. వెంటనే ప్రయోగంలోకి వచ్చేసింది. ఈరోజు ఇది రియాలిటీగా మారడం వారికి ఎంతో సంతోషంగా ఉందని ఓక్‌ల్యాండ్ ప్రజలు చెప్తున్నారు. వాతావరణ మార్పులు కూడా కార్చిచ్చులకు కారణంగా మారడంతో ఎప్పుడూ వాటిని కనిపెడుతూ ఉండడం కష్టంగా మారిందని, ఇప్పుడు ఏ ప్రమాదాన్ని అయినా సెన్సార్లు ముందుగా గుర్తించి అధికారులకు సమాచారం అందిస్తాయి కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News