Big Stories

Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే.. ప్రమాదం జరిగింది ఇలా..?

Odisha Train Tragedy(Telugu breaking news today) : ఒడిశాలోని బాలేశ్వర్‌ లో 3రైళ్లు ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే పెను విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. చాలా మంది ప్రయాణికులు నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరికొంది తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేశారు.

- Advertisement -

అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 6.50 గంటల నుంచి 7.10 మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళుతుండగా బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద తొలుత పట్టాలు తప్పింది. ఈ రైలులోని కొన్ని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి.

- Advertisement -

ఆ బోగీలను షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఆ తర్వాత బోల్తాపడ్డ కోరమండల్‌ బోగీలను గూడ్సు రైలు దూసుకొచ్చి ఢీకొట్టింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని స్థానికులు , అధికారులు చెప్పారు. అలాగే ప్రమాదం సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు అతి వేగంతో ఉన్నాయని అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు . క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారు. బాలాసోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారని తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News