BigTV English

Winter Care For Kids: వణికిస్తున్న చలి.. మీ పిల్లల్ని ఇలా కాపాడుకోండి..

Winter Care For Kids:తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. ఈ చలకి పెద్దపిల్లలే కాదు.. పిల్లలు కూడా వణికిపోతున్నారు. దీంతో పిల్లలు ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి.అయితే పిల్లల హెల్త్ పట్ల వారి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి

Winter Care For Kids: వణికిస్తున్న చలి.. మీ పిల్లల్ని ఇలా కాపాడుకోండి..
Weather report in telugu states

Weather report in telugu states(Morning news today telugu):

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. ఈ చలికి పిల్లలే కాదు.. పెద్దలు కూడా వణికిపోతున్నారు. దీంతో పిల్లలు ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. అయితే పిల్లల హెల్త్ పట్ల వారి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


పిల్లలు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండటమే ఉత్తమ మార్గం. రెగ్యులర్‌గా చేతులు వాష్ చేసుకోవాలి. ముఖ్యంగా భోజనం చేసేముందు, వాష్‌రూమ్ వినియోగించిన తరువాత.. చేతులు వాష్ చేసుకోవడం పిల్లలకు అలవాటు చేయాలి.

వింటర్ సీజన్‌లో పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా బద్ధకంగా ఉంటారు. ఇలా బద్ధకంగా ఉండటం వలన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గే ఛాన్స్ ఉంది. ఉదయాన్నే యోగా, వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే సీజనల్ వ్యాధులు రాకుండా హెల్త్‌ను కాపాడుకోవచ్చు. పిల్లలు యాక్టివ్‌‌గా చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. శారీరక శ్రమతో పాటు మంచి నిద్ర ఉండేలా చూడాలి.


చలి నుంచి పిల్లలను రక్షించేందుకు స్వెటర్, తలకు క్యాప్ వేయాలి. ఇవి పిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచి.. చలి గాలుల నుండి రక్షిస్తాయి. చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్స్ వాడాలి. బయటకు వెళ్లేప్పుడు హ్యాండ్ గ్లవ్‌లు, షూలు వాడాలి.

పిల్లలకు పెట్టే ఆహారంలో నట్స్, విటమిన్స్ ఉండేలా చూడాలి. వీటితోపాటు విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకుంటే మంచిది. ఉడికించిన ఒక గుడ్డు రోజూ తీసుకోవాలి. టైమ్‌కి భోజనం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. గోరువెచ్చని నీరు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల శరీరంలో ఇమ్యూనీటి లెవల్స్ పెరుగుతాయి.

ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. పిల్లలు జలుబు, దగ్గు బారిన పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో అప్రమత్తమై వైద్యుడుని సంప్రదించండి. పిల్లలకు వేయించాల్సిన టీకాలు గురించి అశ్రద్ధగా ఉండకండి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×