BigTV English

World Bank : భారత్‌ వృద్ధి రేటు అంచనా పెంచిన వరల్డ్ బ్యాంక్

World Bank : భారత్‌ వృద్ధి రేటు అంచనా పెంచిన వరల్డ్ బ్యాంక్

World Bank : 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను మళ్లీ పెంచింది… వరల్డ్ బ్యాంక్. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఎదురైన ఒడిదొడుకుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని, జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదుకావడమే… వృద్ధి అంచనాల సవరింపునకు కారణమని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.


2023-24లో భారత వృద్ధి రేటు కాస్త నెమ్మదించి 6.6 శాతంగా నమోదు కావచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనేక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో… భారత వృద్ధి రేటు అంచనాలను పెంచిన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ వరల్డ్ బ్యాంకే. 2022-23కు భారత వృద్ధి రేటు అంచనాను గతంలో 7.5 శాతంగా ప్రకటించిన వరల్డ్ బ్యాంక్, గత అక్టోబరులో దాన్ని 6.5 శాతానికి తగ్గించి… ఇప్పుడు 6.9 శాతానికి పెంచింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతానికి లోపే కట్టడి చేయాలనే లక్ష్యాన్ని భారత్ సాధించేలా కనిపిస్తోందని వరల్డ్ బ్యాంక్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. పన్నుల వసూళ్లలో బలమైన వృద్ధే ఇందుకు కారణమని తెలిపింది. 2022-23లో ప్రభుత్వ అప్పు జీడీపీలో 84.2 శాతానికి తగ్గుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా. 2020-21లో ఇది 87.6 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 9.5 శాతం వృద్ధి ఉండగా.. వ్యయాలు మాత్రం 12.2 శాతం పెరుగుతాయని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. 2020-21లో కరెంటు ఖాతా మిగులు ఉండగా… 2021-22లో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.1 శాతానికి చేరిందని… దిగుమతులు పెరగడంతో అది 2022-23లో మరింత పెరగనుందని వెల్లడించింది. ఇటీవల కమోడిటీ ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిడి అదుపులోకి వస్తుందని పేర్కొంది. ఇక ఈ ఏడాది విదేశీ మారకపు నిల్వలు 13 శాతం తగ్గినా.. మరో ఎనిమిది నెలల దిగుమతుల విలువకు సరిపోతాయని వరల్డ్ బ్యాంక్ లెక్కగట్టింది.


Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×