BigTV English

World Largest Day Time: అతిపెద్ద పగలు.. ఇవాళ లాంగెస్ట్ డే..

World Largest Day Time: అతిపెద్ద పగలు.. ఇవాళ లాంగెస్ట్ డే..


World Largest Day Time:

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను ఈరోజు ఎక్స్​పీరియన్స్​ చేస్తున్నాం. సాధారణంగా పగటి పూట 8 నుంచి 12 గంటలు ఉంటుంది. అలాంటిది.. జూన్‌ 21న అంటే ఈరోజు మాత్రం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.


సాధారణంగా భారత్‌లో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతుంది. అయితే అతిపెద్ద పగటిపూటైన ఈరోజు మాత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరిగింది. ఏపీలో గుడివాడలోనూ అదే సమయంలో సూర్యుడు ఉదయించాడు. కొన్నిచోట్ల సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. డిసెంబర్ 22వ తేదీన లాంగెస్ట్ నైట్ డే ఏర్పడుతుంది.

చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం కాగా….. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరగనుంది. ఏటా జూన్‌ 20 లేదా 21న లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది.

సాధారణ రోజుల్లో పగటి సమయం 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం సూర్యుడు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకి లంబంగా వస్తాడు. అందువల్ల మధ్యాహ్నం కొంతసేపు మన నీడ కూడా ఏర్పడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో 1975లో జరగగా, మళ్లీ 2203 జూన్ 22న అతిపెద్ద పగటి పూట ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×