BigTV English

Water Day :- స్వచ్ఛమైన తాగునీటి కోసం పోరాటం..

Water Day :- స్వచ్ఛమైన తాగునీటి కోసం పోరాటం..

Water Day :-పంచభూతాలు అనేవి కూడా ఇప్పుడు కలుషితం బారిన పడుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు, తరువాతి తరాల వారికి ప్రకృతిని సురక్షితంగా అందజేయాలనుకునేవారు వాతావరణాన్ని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా.. కాలుష్యం శాతం పెరిగిపోవడం వల్ల వారు కూడా పూర్తిస్థాయిలో దీనిని అరికట్టలేకపోతున్నారు. తాజాగా వరల్డ్ వాటర్ డే సందర్భంగా నీటిని కాపాడే దిశగా అందరూ అడుగువేయాలని పిలుపునిస్తున్నారు.


ప్రతీ సంవత్సరం మార్చ్ 23న వరల్డ్ వాటర్ డేను సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ సెలబ్రేట్ చేసుకునే విధంగా మంచి తాగునీరు అందరికీ దక్కడం లేదు. ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల ప్రజలు కలుషిత నీటినే తాగాల్సిన పరిస్థితి ఉంది. అందుకే స్వచ్ఛమైన నీరును కాపాడడం, నీటి సమస్యను దూరం చేయడం ఈ వరల్డ్ వాటర్ డేను ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సిన విషయాలని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. దాదాపు 2 బిలియన్ మందికి స్వచ్ఛమైన తాగునీరు లభించడం లేదని సర్వే చెప్తోంది.

సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి నీటి సమస్య దూరమవుతుందని చాలామంది భావించారు. కొన్ని రకాలుగా దాన్ని నిజం చేయడానికి కూడా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీల సాయంతో అందరికీ స్వచ్ఛమైన నీరు అందుతుందా లేదా, వారి చుట్టూ వాతావరణం పారిశుధ్యంగా ఉందా లేదా అన్న విషయాలను కనుక్కోవచ్చు. దీని ద్వారా తాగునీటి సమస్య ఎవరెవరికి ఉందో కనిపెట్టవచ్చు.


తాగునీటి సమస్య గురించి చర్చించడానికి త్వరలోనే ఒక సమావేశం కూడా ఏర్పాటు కానుంది. ఆ సమావేశంలో ఎలాంటి సాయం అందిస్తే.. తాగునీటి సమస్య దూరమవుతుంది అనేదాంతో పాటు పలు ఇతర అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. అభివద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం అనేది పెద్ద ఛాలెంజ్ అని నిపుణులు అంటున్నారు. పర్యావరణంలో మార్పులు, నీటి కొరత లాంటి సమస్యలు తాగునీటిపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయన్నారు.

2030లోపు టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఉన్నదానికంటే 40 శాతం ఎక్కువ స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించాలని ప్రభుత్వాలపై ప్రెజర్ ఉంది. దీంతో పాటు ఫుడ్ సెక్యూరిటీ వంటి ఎన్నో సమస్యలపై వారు దృష్టిపెట్టాలని నిపుణులు చెప్తున్నారు. నీటి వనరులను కాపాడుకోవడమే తాగునీటి డిమాండ్‌కు ముఖ్యమైన పరిష్కారమని వారు అంటున్నారు. మరి పర్యావరణవేత్తలు, ప్రజలు అనుకుంటున్నట్టు స్వచ్ఛమైన తాగునీరు అందరికీ దగ్గుతుందో లేదో చూడాలి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×