EPAPER

Teeth : ఐదు నిమిషాల్లో మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి

Teeth : ఐదు నిమిషాల్లో మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి

Teeth : సాధారణంగా దంతాలను తెల్లగా మెరిసేలా ఉంచుకోవాలని అందరూ చూస్తుంటారు. మన దంతాలు ఎంత తెల్లగా ఉంటే నవ్వు అంత అందంగా ఉంటుంది. అయితే పళ్ల వరుస అందంగా ఉన్నా.. పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో నవ్వలేము. అందుకే ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా దంతాలు రంగు మారడం సహజం. ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు పచ్చగా మారిపోతాయి. ఈ పసుపు పొరను పోగొట్టి తిరిగి మన దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటించండి. ఎక్కువశాతం మంది పళ్లు పసుపుగా మారగానే దంత వైద్యుడి దగ్గరకు పరుగులుపెట్టి ఖరీదైన చికిత్స తీసుకుంటారు. కాకపోతే అవి తాత్కాలికంగానే పనిచేస్తాయి. మన ఇంట్లో సులభంగా దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో పళ్ల మీద గారను పోగొట్టుకోవచ్చు. అలాగే కావిటీస్, పంటినొప్పి, గార, చిగుళ్ల నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం రెండు పదార్థాలు మాత్రమే సరిపోతాయి. కాకపోతే కొంచెం సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒక స్పూన్ మిరియాల పొడిలో అరస్పూన్ ఉప్పు కలిపి నీళ్లుపోసి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ పేస్ట్‌తో ఉదయం, రాత్రి బ్రష్‌ చేసుకుంటే క్రమంగా పళ్ళు తెల్లగా అవుతాయి. ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో తెల్లని దంతాలను పొందవచ్చు. మిరియాల్లో ఉన్న లక్షణాలు కావిటీస్, గార, పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఉప్పు చిగుళ్ల నొప్పిని తగ్గించడంతో పాటు పళ్లు తెల్లగా అవడానికి దోహదపడుతుంది.
మిరియాలు, ఉప్పు కలిపి పళ్ల మీద ప్రభావవంతంగా పనిచేస్తాయి. పళ్లు మెరవాలంటే పెద్దగా ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు. కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే చాలు. పైగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా లేకుండా ఇంట్లోనే తెల్లగా మార్చుకోవచ్చు. మిరియాలు,ఉప్పు రెండూ మనకు ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ రెమిడీని ట్రై చేయండి. పంటి నొప్పి సమస్యలు, చిగుర్ల సమస్యలు కూడా ఉండవు.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×