EPAPER

BIG TV SURVEY: మునుగోడు ఉపఎన్నికపై బిగ్ టీవీ సర్వే బిగ్ హిట్

BIG TV SURVEY: మునుగోడు ఉపఎన్నికపై బిగ్ టీవీ సర్వే బిగ్ హిట్

బిగ్ టీవీ… ద నెక్స్ట్ బిగ్ థింగ్. అన్నట్లుగానే… ఛానల్ ప్రారంభించిన మొదట్లోనే బిగ్ టీవీ… బిగ్ సక్సెస్ సాధించింది. తలపండిన రాజకీయ నాయకులే అంచనా వేయలేని మునుగోడు ఫలితాన్ని… అత్యంత కచ్చితంగా చెప్పగలిగింది బిగ్ టీవీ. గరుడ సంస్థతో కలిసి బిగ్ టీవీ నిర్వహించిన సర్వేకు అనుగుణంగానే మునుగోడు ఫలితాలు వచ్చాయి. ఇలా ఆరంభంలోనే సూపర్ హిట్ కొట్టింది బిగ్ టీవీ.


దేశంలోనే మొట్టమొదటి ఓటీటీ ఛానల్ బిగ్ టీవీ… ఆరంభంలోనే సూపర్ హిట్ కొట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఎన్నికల ఫలితాన్ని అత్యంత కచ్చితంగా అంచనా వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజానికి మునుగోడులో జరిగిన హోరా హోరీ పోరు చూశాక… అక్కడ ఎవరు గెలుస్తారన్నది ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేకపోయారు. సాక్షాత్తూ ఆయా పార్టీల అగ్ర నాయకులే ఏమైనా జరగవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కానీ బిగ్ టీవీ మాత్రం సాధికారికంగా ఫలితాన్ని అంచనా వేసింది. గరుడ సంస్థతో కలిసి సర్వే నిర్వహించి.. మునుగోడులో గెలుపు గులాబీ దళానిదే అని చెప్పింది. ఫలితం అందుకు అనుగుణంగానే వచ్చింది.

5 వేల శాంపిల్స్ సేకరించి.. అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేలో మండలాల వారీగా ఎవరికి ఆధిక్యం దక్కొచ్చన్నది అంచనా వేసింది. శాతాలు కాస్త అటూ ఇటూ అయినా ఫలితంగా మాత్రం ఇదేనని ఘంటాపథంగా చెప్పింది. బిగ్ టీవీ సర్వేలో చెప్పినట్లుగానే దాదాపు అన్ని మండల్లాలోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యం కనిపించింది. బీజేపీ గట్టిపోటీ ఇచ్చినా చివరికి గెలుపు మాత్రం టీఆర్ఎస్ నే వరించింది.


సర్వే అంటే ఎవరో నలుగురిని.. నోటికొచ్చిన నాలుగు ప్రశ్నలు అడిగి వారు చెప్పింది రాసుకోవడం కాదు. దానికి ఓ శాస్త్రీయమైన పద్దతి ఉంటుంది. బిగ్ టీవీ నిర్వహించిన సర్వే కూడా అంతే అలాగే జరిగింది. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 110 పోలింగ్ బూత్ లను కవర్ చేయగా.. ప్రతీ బూత్ నుంచి 40 కి పైగా నమూనాలను సేకరించింది. నియోజకవర్గంలో మొత్తం 5 వేల శాంపిళ్లు సేకరించగా.. ఇందులో 2 వేల 863 మంది పురుషులు, 2 వేల 137 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం ఏడు మండలాలు, రెండు మున్సిపాల్టీల పరిధిలో ఈ సర్వే సాగింది. నియోజకవర్గంలోని అన్ని పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి గణాంకాలు అన్నింటినీ బేరీజు వేసి… అత్యంత నిఖార్సైన సర్వే ను నిర్వహించింది.

సర్వే అంత కచ్చితంగా జరిగింది కాబట్టే.. ఫలితంగా కూడా అంతే కచ్చితంగా వచ్చింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ సర్వే నిర్వహించిన బిగ్ టీవీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Related News

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Russia vs Ukraine War: మోసపోయి..రష్యా ఆర్మీలో చేరి.. యుద్ధం చేసి తిరిగివచ్చిన భారతీయ యువకుల కథ

Steel Plant Politics: స్టీల్‌ప్లాంట్ పంచాయతీ.. మీ స్టాండ్ ఏంటి?

Donald Trump Shooting: గురి తప్పింది.. టార్గెట్ ట్రంప్.. వెనక ఉన్నది ఎవరు?

Jani Master Case : వాష్ రూమ్, డ్రెస్ ఛేంజ్.. జానీ కహానీ

Kejriwal Resign: కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్.. రాజీనామా ప్రకటన వెనుక అసలు సంగతి ఇదా ?

Big Stories

×