BigTV English

3-2-1 Rule: నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? 3-2-1 రూల్ ట్రై చేయండి

3-2-1 Rule: నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? 3-2-1 రూల్ ట్రై చేయండి

3-2-1 Rule: ప్రతి రోజు శరీరానికి తగినంత నిద్ర పోవడం చాలా అవసరం. ప్రస్తుతం చాలా మంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా వివిధ షిప్ట్‌లలో పనిచేస్తున్నారు. అంతే కాకుండా కంప్యూటర్లు, ఫోన్‌లను కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ జీవనశైలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సరిగ్గా నిద్ర లేని వారు రోజంతా యాక్టీవ్‌గా ఉండలేరు. అంతే కాకుండా తమ పనిపై కూడా దృష్టి పెట్టలేరు.


ఎవరైనా సరే మాససిక స్థితి సరిగ్గా ఉంచుకోవడంతో పాటు , రోజంతా శక్తివంతంగా ఉండటం కోసం రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పోవడం చాలా ముఖ్యం. మెదడును రీఛార్జ్ చేయడానికి నిద్ర చాలా ముఖ్యం. ఈ సమయంలోనే శరీరంతో పాటు మెదడు కూడా రీచార్జ్ అవుతుంది. ఇదిలా ఉంటే నిద్ర లేమి కూడా ఏకాగ్రత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గుదల, గుండె జబ్బులు, మధుమేహం వంటి పరిస్థితులకు కారణం అవుతుంది. నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్న వారు 3-2- 1 రూల్ పాటించడం చాలా ముఖ్యం ఇదిజ సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

3-2-1 నియమం అంటే ఏమిటి ?


3- నిద్రపోవడానికి మూడు గంటల ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు.
2- నిద్రపోవడానికి 2 గంటల ముందు ఆహారాన్ని తినడం ఆపేయాలి.
1-పడుకునే ఒక గంట ముందు డ్రింక్స్ త్రాగడం ఆపండి.

పడుకునే 3 గంటల ముందు: ఆల్కహాల్ త్రాగకండి: ఆల్కహాల్ నిద్రను ప్రభావితం చేస్తుంది. అందుకే పడుకునే 3 గంటల ముందు వరకు ఆల్కహాల్ తీసుకోకూడదు. తరుచుగా ఆల్కహాల్ తీసుకునే వారు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే పడుకునే 3 గంటల ముందు వరకు ఆల్కహాల్ తీసుకోకుండా ఉండాలి.

పడుకునే 2 గంటల ముందు: నిద్ర పోయే ముందు ఆహారం తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతే కాకుండా బ్లడ్‌లో షుగర్ పెరుగుతుంది. అంతే కాకుండా నిద్రకు కూడా ఆటంకాన్ని కలిగిస్తుంది. ఆహారం జీర్ణం అవడానికి విశ్రాంతి చాలా అవసరం.

Also Read: ఈ డ్రింక్స్ త్రాగితే ఆరోగ్య సమస్యలు పరార్ !

పడుకునే 1 గంట ముందు: ద్రవ పదార్థాలు త్రాగకుండా ఉంటే మంచిది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురైతే ఆహారం జీర్ణం అవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఫలితంగా నిద్ర లేమి సమస్య రావచ్చు. అందుకే నిద్ర పోయే గంట ముందు వరకు ద్రవ పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Madhavan: నో జిమ్, నో వర్కౌట్స్.. 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్!

Ichthyosis Vulgaris: ఇదో వింత వ్యాధి, లక్షణాలు గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం

Ajwain Health Benefits: మందులు అవసరమే లేదు.. ఈ కషాయం తాగితే జలుబు మాయం

Papaya: వీళ్లు పొరపాటున కూడా బొప్పాయి తినకూడదు !

Cumin Health Benefits: చిన్నగా ఉందని చులకన చేయకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

Health Tips: అలసటగా అనిపిస్తోందా? ప్రధాన కారణాలివే !

Mental Health: మానసిక ప్రశాంతత కోసం.. ఈ టిప్స్ తప్పక ట్రై చేయండి

Brain Tumor: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Big Stories

×