BigTV English

Janaka Aithe Ganaka: దంచికొడుతున్న సుహాస్ మూవీ.. 4 డేస్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

Janaka Aithe Ganaka: దంచికొడుతున్న సుహాస్ మూవీ.. 4 డేస్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

OTT Movie..ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు అటు ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసి మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని వారు.. చాలామంది ఇంట్లో కూర్చుని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీటికి వ్యూస్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ‘జనక అయితే గనక’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్(Suhas).


ఓటీటీ లో దూసుకుపోతున్న సుహాస్ మూవీ..

డిఫరెంట్ స్టోరీలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఈ సినిమాతో ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఈ సినిమా అక్కడ కూడా అదరగొడుతోంది. ఎంతలా అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 5కోట్లకు పైగా స్ట్రీమింగ్ వ్యూస్ ను రాబట్టి రికార్డ్స్ సొంతం చేసుకుంది.


ప్రమోషన్స్ లేకుండానే భారీ రెస్పాన్స్..

సుహాస్ హీరోగా, సంగీర్తన విపిన్ హీరోయిన్ గా, సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జనక అయితే గనక ‘. దిల్ రాజు బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ పాటలతో, మంచి పాజిటివ్ టాక్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి. ప్రమోషన్స్ పెద్దగా చేపట్టలేదు. కానీ సినిమాను చూడడానికి ఆడియన్స్ కూడా ఆసక్తి చూపించారు. డిఫరెన్స్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై అభిమానులు, నెటిజెన్స్ ప్రశంసలు కురిపించారు. దీంతో ఓటీటీకి వచ్చే ముందు చిత్ర బృందం సినిమాను బాగా ప్రమోట్ చేశారు.

జనక అయితే గనక స్టోరీ..

‘జనక అయితే గనక’ స్టోరీ పరంగా చూసినట్లయితే.. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. ఖర్చులకు భయపడి పెళ్లి తర్వాత కూడా కొన్నేళ్లపాటు పిల్లలు వద్దనుకునే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి చుట్టూ తిరిగే కథే ఈ జనక అయితే గనక… పిల్లలు వద్దనుకున్నప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వడం, దీనికి కండోమ్ కారణమని, తెలుసుకున్న అతడు కండోమ్ కంపెనీ పై కేస్ వేయడం, ఆ తర్వాత కోర్టు డ్రామాతో సరదాగా అందరిని నవ్వించే విధంగా కథ సాగిపోయింది. ఇప్పుడు ఓటీటీ లో భారీ రెస్పాన్స్ అందుకుంటూ తనకు తిరుగులేదు అని నిరూపించుకుంటున్నారు సుహాస్. ఇకపోతే గతంలో సుహాస్ నటించిన చిత్రం ‘ప్రసన్న వదనం’ సినిమా కూడా 100 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు జనక అయితే గనక కూడా ఓటీటీ లో భారీ రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఏది ఏమైనా సుహాస్ కి ఈ మధ్యకాలంలో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు..

సుహాస్ విషయానికి వస్తే.. ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ మొదలుపెట్టిన ఈయన , ఆ తర్వాత 2018లో ‘పడి పడి లేచే మనసు’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. మొదటిసారి ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారారు. ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఇక సినిమాలే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు సుహాస్.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×