Pushpa Movie trailer update: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్ లో పుష్ప 2 ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించడం. వాస్తవానికి పుష్ప సినిమాకి మొదట తెలుగులో మిశ్రమ స్పందన లభించింది. కానీ నార్త్ లో మాత్రం పుష్పరాజ్ దెబ్బకి బాక్సాఫీస్ షేక్ అయింది. పుష్ప సినిమా ఎంతగా పాపులర్ అయిందంటే ఎక్కడ చూసినా పుష్పరాజ్ మానియా కనిపించేది. చాలామంది స్పోర్ట్స్ మెన్స్, పొలిటికల్ లీడర్స్ వీరందరూ కూడా పుష్ప డైలాగ్స్ ను విపరీతంగా వాడేవాళ్లు. ఇకపోతే ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది దర్శకుడు సుకుమార్ మరియు అల్లు అర్జున్ కి. ఇప్పటివరకు ఏ తెలుగు యాక్టర్ కి రాని నేషనల్ అవార్డు ఈ సినిమాతో అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు.
వాస్తవానికి పుష్ప 2 సినిమా ఇదివరకే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ మధ్య కూడా డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవ్వదు అని తెగ వైరల్ అయింది. వాటన్నిటికి చెక్ పెడుతూ పుష్ప సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీం తేల్చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న టైంలో ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ నవంబర్ 17న రిలీజ్ కానుంది. ట్రైలర్ అప్డేట్ తో పాటు ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సినిమా మీద మరింత హైప్ పెంచుతుంది. పుష్పరాజ్ ఆటిట్యూడ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సినిమాలో డైలాగ్ లాగానే పోస్టర్లో పుష్పరాజ్ కూడా తగ్గేదేలే అనేటట్లు ఉన్నాడు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ తనదైన స్వాగ్ తో గన్ పట్టుకొని ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పోస్టర్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఈ ట్రైలర్ ను పాట్నా లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
Dropping an EXPLOSIVE BANGER before the MASS festival begins in Cinemas ❤🔥
Experience the MASSIVE #Pushpa2TheRuleTrailer on 17th November at 6:03 PM 🌋🌋
With a Blasting Event at PATNA 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/LsLRpTQ2oK
— Mythri Movie Makers (@MythriOfficial) November 11, 2024
ఇప్పటికే ఈ సినిమా యూనిట్ మంచి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని నిర్మాత రవి తెలిపారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కేవలం దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు సంగీత దర్శకులు కూడా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తూ వస్తున్నాయి. అని వీటి గురించి అధికారక ప్రకటన రాలేదు. కానీ ఎక్కడ చూసినా పుష్ప పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది.
Also Read : Samantha: నా వల్ల కాలేదు.. వాళ్లు నన్ను చాలా ఏడిపించారు