Dry Fruits For Glowing Skin: ముఖం అందంగా కనిపించేందుకు రకరకాల ఫేస్ క్రీములను వాడుతూ ఉంటారు. కానీ వాటిలో అనేక రసాయనాలు ఉండటం వల్ల అవి ముఖాన్ని అప్పటికప్పుడు అందంగా కనిపించేలా చేసినా కొంత కాలం తర్వాత సమస్యలు ఎదురవుతాయి. అందుకే నేచురల్ గా ఉండే ప్రొడక్ట్స్ వాడటం మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపయోగపడతాయి.
కొంత మంది దగ్గర ఖరీదైన క్రీములు కొనడానికి తగినంత డబ్బు ఉండదు. అలాంటి వారు చర్మ సంరక్షణ కోసం సైడ్ ఎఫెక్ట్స్ కలిగించని ఆహార పాదార్థాలు తీసుకోవడం మంచిది. ముఖం అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఆయుర్వేద చికిత్స, హోం రెమెడీస్ లాంటివి ప్రయత్నిస్తారు. ఖరీదైన క్రీములు వాడినా కొన్ని సార్లు ప్రయోజనం ఉండదు.
డ్రై ఫ్రూట్స్ లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యంతో పాటు అందంగా కనిపించడానికి ఉపయోగపడతాయి. ముఖం అందంగా కనిపించడానికి ప్రతిరోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: Diet: సహజంగా బరువు తగ్గడానికి 5 బెస్ట్ టిప్స్..
బాదం:
బాదంలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మం తేమగా ఉండడానికి సహాయపడుతుంది. బాదం తినడం ద్వారా చర్మం ఎల్లప్పుడు కాంతివంతంగా కనిపిస్తుంది.
ఖర్జూరం:
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఖర్జూరంలో పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఖర్జూరం తింటే ముఖంపై మొటిమలు కూడా తగ్గుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మం మెరుపు సంతరించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న మురికిని తొలగించడానికి ఖర్జూరం దోహదం చేస్తుంది.
Also Read: Drinking Coffee: ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?
అంజీర్ :
అంజీలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడానికి సహకరిస్తుంది. వీటీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మొటిమలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. రోజు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది.
వాల్ నట్స్:
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.వాల్ నట్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ బి ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. అంతే కాకుండా త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తుంది.
Also Read: నైట్ షిఫ్ట్ చేసే వారికి అలర్ట్.. అనేక ప్రాణాంతకర వ్యాధులు వచ్చే ఛాన్స్..
జీడిపప్పు:
విటమిన్ ఇ, సెలీనియం జీడిపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖంపై మచ్చలను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే పైన చెప్పిన డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగని డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. మితంగానే తినాలి. అప్పుడు మాత్రమే ప్రయోజనాలు దక్కుతాయి. చర్మం కూడా మెరుస్తూ, కాంతివంతంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లోని పోషకాలు ముఖం అందంగా కనిపించడానికి దోహదం చేస్తాయి