BigTV English

Boy friend Killed in front of Girlfriend: తమిళనాడులో దారుణం.. ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడిని వేటకొడవళ్లతో నరికి చంపిన వైనం

Boy friend Killed in front of Girlfriend: తమిళనాడులో దారుణం.. ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడిని వేటకొడవళ్లతో నరికి చంపిన వైనం

Boyfriend Killed in front of Girlfriend in Tamil Nadu: వాళ్లిద్దరు లవర్స్.. ఒకరినొకరు ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఓ హొటల్‌కి వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈ విషయం ప్రత్యర్థులకు తెలిసింది. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే కత్తులతో బయలుదేరి హోటల్ వద్దకు వచ్చారు.


ప్రత్యర్థులను గమనించిన ఆ వ్యక్తి బయటకు పారిపోయే ప్రయత్నం చేశాడు. గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు అతడ్ని రౌండప్ చేశారు. కింద పడేసి ప్రియురాలి కళ్ల ముందే కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో చోటు చేసుకుంది.

అసలేం జరిగింది? డీటేల్స్‌లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లాలోకి వాగైకుళానికి చెందిన 30 ఏళ్ల దీపక్‌రాజా. ఆయనపై పలు హత్య కేసులున్నాయి. ప్రియురాలితో కలిసి పాళయంగోట్టై కేటీసీనగర్‌లోకి ఫేమస్ హోటల్‌కి వెళ్లాడు. భోజనం చేస్తుండగా ప్రత్యర్థులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు.


Also Read: ఉబర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పట్నుంచంటే..?

దీపక్‌రాజ్‌ని వెంటనే ఐదుగురు వ్యక్తులు రౌండప్ చేశాడు. తమతో తెచ్చుకున్న వేటకొడవళ్లతో నరికి నరికి చంపేశాడు. కళ్ల ముందే తన ప్రియుడ్ని చంపడం చూసి మౌనంగా ఉండిపోయింది ప్రియురాలు. ఈ ఘటనలో జరుగుతుండగా ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. పట్టపగలు జరిగిన ఘటన గురించి పోలీసులు తెలిసింది. వాళ్లు వచ్చేసరికి ఆ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది.

కమ్యూనిటీ విభేదాల కారణంగా దీపక్‌రాజా హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీపక్ రాజాపై పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే దీపక్‌ను చంపిందెవరు? ప్రియురాలికి సంబంధించిన వాళ్లా? లేక ప్రత్యర్థులా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×