Skin Whitening Tips: ప్రతి ఒక్కరూ ముఖాన్ని అందంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు ముఖం నల్లగా మారుతుంది. అంతే కాకుండా నుదుటిపై నలుపు రావడం కూడా మొదలవుతుంది. ఇది ముఖ సౌందర్యాన్ని తగ్గించడమే కాదు, కొన్నిసార్లు చర్మ వ్యాధికి సంకేతం కూడా కావచ్చు.
కొంత మందిలో స్కిన్ ట్యానింగ్ వల్ల నుదురు, పెదాల చుట్టు కూడా నల్లగా మారుతుంది. మీరు కూడా ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటే గనక కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలను ప్రయత్నించండి . వాటి సహాయంతో నుదుటిపై ఉన్న నలుపు పూర్తిగా తగ్గించుకోవచ్చు.
సూర్యరశ్మి, కాలుష్యం లేదా హార్మోన్ల మార్పులు వంటి అనేక కారణాల వల్ల నుదుటిపై నల్లగా మారుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సులభమైన హోం రెమెడీస్‌తో ట్యాన్ పూర్తిగా తొలగించవచ్చు.
ట్యాన్ పోగొట్టే హోం రెమెడీస్:
పాలు , పసుపు: పాలలో పసుపు కలిపి పేస్ట్ లా చేసి నుదుటిపై రాయండి. 15 నిమిషాల తర్వాత దీనిని కడిగేయండి. పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా పాలు కూడా చర్మాన్ని తేమగా మారుస్తాయి.
నిమ్మ, తేనె: నిమ్మరసం , తేనె మిక్స్ చేసి పేస్ట్ లాగా చేయండి. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. తరుచుగా ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ట్యాన్ తొలగిపోతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని తెల్లగా చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని తేనె చర్మానికి పోషణను అందిస్తుంది.
టమాటో:
ముందుగా ఒక టమాటోను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో కాస్త పెరుగు కలపండి. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. టమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మాన్ని టానింగ్ నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా పెరుగు చర్మాన్ని ఉపశమనం చేస్తుంది.
బంగాళదుంప: పచ్చి బంగాళాదుంప తురుమును నుదిటిపై రాయండి. బంగాళదుంపలో చర్మాన్ని తెల్లగా మార్చే బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై ఉన్న ట్యాన్ తొలగిస్తాయి. అంతే కాకుండా మొటిమలు రాకుండా చేస్తాయి.
ఓట్స్: ఓట్స్‌ను నీళ్లలో నానబెట్టి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి. ఓట్స్ అనేది మృత చర్మ కణాలను తొలగించే సహజమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది చర్మానికి గ్లో అందిస్తుంది. త్వరగా ట్యాన్ తొలగిపోవాలంటే ఓట్స్ చాలా బాగా పనిచేస్తుంది.
శనగపిండి, పసుపు: శనగపిండిలో పసుపు, పాలు కలిపి పేస్ట్ చేయండి. దీనిని ముఖానికి అప్తూ చేసి 10 నిమిషాల తర్వాత వాష్ చేయండి. శనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా పసుపు చర్మాన్ని తెల్లగా మారుస్తుంది.
ఈ హోం రెమెడీస్ ఉపయోగించే మార్గాలు:
శుభ్రపరచడం: ముందుగా నుదుటిని శుభ్రమైన నీటితో కడగాలి.
పేస్ట్ అప్లై చేయండి: పైన పేర్కొన్న పేస్ట్‌లో దేనినైనా తయారు చేసి నుదుటిపై రాయండి.
పొడిగా ఉండనివ్వండి: 15-20 నిమిషాలు ఆరనివ్వండి.
శుభ్రం చేయండి: తర్వాత చల్లటి నీటితో కడగాలి.
మాయిశ్చరైజర్: చివరగా మాయిశ్చరైజర్ రాయండి.
Also Read: ఒత్తైన జుట్టు కావాలా ? అయితే ఇవి వాడండి
కొన్ని అదనపు చిట్కాలు :
సన్‌స్క్రీన్ ఉపయోగించండి: ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి.
నీరు త్రాగాలి: తగినంత నీరు త్రాగాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినండి.
ఒత్తిడిని తగ్గించుకోండి: ఒత్తిడి వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.