BRS Party: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేయాలని పార్టీలు ఎందుకంటు న్నాయి? గతంలో కాంగ్రెస్ కాగా.. ఇప్పుడు బీజేపీ వంతైందా? ఏమైనా హ్యాండ్ ఇచ్చిందా? పొత్తులంటూ మిత్రులను కెలకడం బీఆర్ఎస్ మొదలుపెట్టిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీని మోసగించి నట్టుగానే, ఇప్పుడు బీజేపీతో ఆటలాడుతుందా? తెలంగాణ బీజేపీ నేతలు బీఆర్ఎస్ పార్టీపై ఎందుకు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు? బీఆర్ఎస్ విధ్వంసకర రాజకీయాల కు తెరలేపిందా? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు.
బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. తెలంగాణలో విధ్వంసకర రాజకీయాలకు తెరలేపిందని అంటున్నారు. ప్రజలపై దాడులు, యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. గ్రూప్-1, కానిస్టేబుల్ ఆందోళనతో విధ్వంసం చేయాలని భావిస్తోందని దుయ్యబట్టారు.
ఆదివారం సంగారెడ్డిలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వాస్తవాలు ఆలోచించాలని సూచన చేశారు. ప్రజల దృష్టిని మళ్లించి ప్రజల ధన, మాన ప్రాణాలతో ఆడుకుంటోందన్నారు. తెలంగాణలో బీజేపీని ఎదగకుండా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
ALSO READ: నిండు గర్భిణీ.. 5 రోజుల్లో కాన్పు.. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. అసలు ఏం జరిగిందంటే?
ఇంతకీ బీఆర్ఎస్ చేసిన కామెంట్స్ ఏంటి? బండి సంజయ్-రేవంత్ మధ్య వ్యాపారాలు న్నాయంటూ కామెంట్స్ చేసింది. అందుకోసమే సంజయ్ కనిపించలేదని ఆ పార్టీ నేతలన్నారు. దీనిపై బండి సంజయ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రెండు రోజులుగా తాను కాళ్ల విపరీతమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని, దాన్ని రాద్ధాంతం చేసే పనిలో బీఆర్ఎస్ పడిందని దుయ్యబట్టారు.
రీసెంట్‌గా ఢిల్లీ వెళ్లిన కేటీఆర్.. కేంద్రమంత్రి ఖట్టర్‌ని కలవలేదని బీజేపీ నేతలు స్వయంగా చెప్పుకొచ్చారు. అమిత్ షాతో కేటీఆర్ సమావేశమయ్యారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్‌ను కలిపేస్తామని అప్పట్లో మాట ఇచ్చి హ్యాండ్ ఇచ్చింది కారు పార్టీ. ఇప్పుడు బీజేపీకి అదే రిపీట్ అవుతోందన్నది కొందరు నేతల మాట. ఈ క్రమంలో బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేడి లేకుండా తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.