Brahmamudi serial today Episode: రూంలో కూర్చుని డిజైన్స్ వేసుకుంటున్న కావ్యకు ఆఫీసులో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. తాను కింద పడబోతుంటే రాజ్ పట్టుకున్న విషయం. తన నడుముపై రాజ్ చేయి వేయడం గుర్తు కొచ్చి కావ్య ఆ మూడ్ లోనే ఉంటుంది. ఇంతలో తేరుకుని ఇలాంటి ఆలోచనలు ఈ టైంలో అసలు రాకూడదు. వస్తే ఇంకేమన్నా ఉందా..? అనుకుని మళ్లీ డిజైన్స్ వేసుకుంటుంది.
బయట మ్మూర్తి చేతిలోంచి స్క్కూడ్రైవర్ కింద పడుతుంది. వెంటనే కనకం వచ్చి మూర్తిని తిడుతుంది. అసలు మీకు బుద్దుందా..? అమ్మాయి లోపల డిజైన్స్ వేస్తుంటే మీరు ఇక్కడ ఈ సౌండ్ చేయడం ఏంటని నిలదీస్తుంది. దీంతో మూర్తి షాక్ అవుతాడు. కనకం భోజనం తీసుకుని కావ్య రూంలోకి వెళ్తుంది. అందరం కలిసి భోజనం చేసేవాళ్లం కదమ్మా ఎందుకు లోపలికి తీసుకొచ్చావని కావ్య అడగ్గానే బయటకు వచ్చి నువ్వు భోజనం చేస్తే డిజైన్స్ వేయడంతో డిస్టర్బ్ అవుతావని లోపలికి తీసుకొచ్చానని కనకం చెప్తుంది. దీంతో కావ్య కోపంగా కనకాన్ని తిడుతుంది.
రూంలో కూర్చుని డిజైన్స్ గురించి ఆలోచిస్తుంటాడు రాజ్. ఎవ్వరూ కూడా మంచి డిజైన్స్ వేయలేదని అంతా చెత్తగా ఉన్నాయని అనుకుంటూ ఆఫీసులో కావ్య కింద పడబోతుంటే తాను పట్టుకున్న విషయం గుర్తు చేసుకుని సిగ్గుపడుతుంటాడు. ఇంతలో తేరుకుని చీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను ముందు డిజైన్స్ వేయాలి అని మనసులో అనుకుంటాడు. ఇంతలో రాజ్ ఆత్మ వస్తుంది.
కనీసం ఇమాజినేషన్ లోనైనా నీ పెళ్లాన్ని ఊహించుకోరా అంటూ నువ్వులాగే ఉంటే ఎలా నా మాట విని ఓడిపోరా.. అప్పుడు కావ్య ఇంటికి వస్తుంది అని ఆత్మ చెప్పగానే చచ్చినా ఓడిపోయేది లేదు అంటాడు రాజ్. అయితే ఆ కళావతినైనా గెలిపించరా..? అంటే కన్పీజ్ లో ఉన్న రాజ్ సరే అంటూ వెంటనే కళావతి గెలిస్తే నన్ను చచ్చే దాకా మేనేజర్ ను చేస్తారు అది నేను భరించలేను అయినా ఈ టైంలో నీతో నాకు మాటలేంటి వెళ్లు ఇక్కడి నుంచి అని ఆత్మను పంపించి వేస్తాడు రాజ్.
ధాన్యలక్ష్మీ ఒక్కతే బయట కూర్చుని ఆలోచిస్తుంటే అపర్ణ చూసి దగ్గరకు వెళ్తుంది. నీకు మా అందరి మీద కోపంగా ఉందని. ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే నువ్వు అర్తం చేసుకునే పరిస్థితిలో కూడా లేవని తెలుసు అంటుంది. అర్థమైంది కదా.. అక్కా మరి ఇంకా ఎందుకు మాట్లాడటం అంటూ సమాధానం ఇస్తుంది ధాన్యలక్ష్మీ. తోడబుట్టక పోయినా ఇన్ని రోజులు మనం అక్కా చెల్లెలు లాగానే ఉన్నాం కదా..? నువ్వు తిండి మానేస్తే నాకు బాధగా ఉండదా..? చెప్పు అంటుంది అపర్ణ.
దీంతో నువ్వు బాధపడితే నా బాధ తీరదు అక్కా. నా సమస్యను పరిష్కరిస్తే తీరుతుంది అని ధాన్యలక్ష్మీ చెప్తుంది. కొంత కాలం తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నా మాట విను ఇలా బాధపడటం మానేసి ప్రశాంతంగా ఉండు అని అపర్ణ చెప్పగానే నువ్వు ఎన్నైనా చెప్తావు అక్కా.. మామయ్య పెట్టిన పందెంలో రాజ్ గెలిస్తే కంపెనీకి సీఈవో అవుతాడు. నీ కోడలు గెలిస్తే తిరిగి ఈ ఇంటికి వస్తుంది. కానీ దీని వల్ల నాకు వచ్చిన లాభమేంటి..? నా కొడుక్కి జరిగే న్యాయం ఏంటి అని ధాన్యలక్ష్మీ, అపర్ణను ప్రశ్నిస్తుంది.
రాజ్, కావ్య ఇద్దరు ఒకటైతే కళ్యాణ్‌ను తీసుకురారని ఎందుకు అనుకుంటున్నావు అంటూ ధాన్యలక్ష్మీని కన్వీన్స్ చేయాలని అపర్ణ మాట్లాడుతుంది. వీళ్లిద్దరిని దూరం నుంచి గమనించిన రుద్రాణి మొత్తం చాటు నుంచి వింటుంది. అపర్ణ వెళ్లిపోయాక ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి వదిన చెప్పిన మాటలు నమ్మేశావే ఏంటి..? ధాన్యలక్ష్మీ అంటూ అడిగి.. అలా నమ్మావంటే నువ్వు మరిన్ని కష్టాల్లో పడిపోతావు అంటూ ధాన్యలక్ష్మీని తన మాటలతో కన్వీన్స్ చేసి వెళ్లిపోతుంది.
ఆఫీసులో రాజ్ నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో ఒక ఎంప్లాయి వచ్చి సార్ అని పిలవగానే ఉలిక్కిపడి లేచి చిరాకుగా ఏంటి అని అడుగుతాడు. ఆ ఎంప్లాయి ఏంటి సార్ ధీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడగ్గానే మీరు పని కరెక్టుగా పని చేస్తే నాకు ఈ ఆలోచలను ఎందుకు చెప్పు అంటాడు రాజ్. ఎంప్లాయి మాత్రం ఫుల్లుగా నిద్రపోతున్నారు. పైకి ఆలోచిస్తున్నాను అంటున్నాడు అని మనసులో అనుకుంటాడు. ఇంతలో రాజ్ దేవుడి నగలు డిజైన్ చేస్తున్నాం కాబట్టి మనం ట్రెడిషనల్ గా ఆలోచించాలని నాకు కొన్ని ఐడియాలున్నాయి చెప్తాను. నువ్వు డిజైన్స్ వేయ్ అని రాజ్ చెప్పగానే సరేనని ఆ ఎంప్లాయి రాజ్ చెప్పినట్టు డిజైన్ వేస్తాడు. ఆ డిజైన్ చూసిన రాజ్ షాక్ అవుతాడు. నేను చెప్పిందేంటి నువ్వే వేసిందేంటి ఇంత దరిద్రంగా వేశావేంటి అని తిడతాడు. ఇక లాభం లేదు ఆ కావ్య వేసిన డిజైన్స్ తస్కరించడమే బెటర్ అని రాజ్ మనసులో అనుకుంటాడు.
ధాన్యలక్ష్మీ తన కోసం వంట చేసుకుంటుంటే వంట మనిషి శాంత వచ్చి నేను అందరికీ వంట చేశానమ్మా మళ్లీ మీరెందుకు చేస్తున్నారు అని చెప్తుంది. అందరికీ చేసింది కాదు నాకు నేనే సపరేట్ గా చేసుకుంటున్నాను అని చెప్తుంది. ఇంతలో అక్కడకు ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. ధాన్యలక్ష్మీకి ఎంత చెప్పినా వినదు దీంతో ఇద్దరూ ధాన్యలక్ష్మీని మార్చేందుకు. కళ్యాణ్‌ను ఇంటికి రప్పించేందుకు ప్లాన్ చేయాలని ఆలోచిస్తారు.
కావ్య డిజైన్స్ కొట్టేయాలనుకున్న రాజ్, కావ్య చాంబర్ దగ్గరకు వెళ్లి కావ్య ఇంటికి వెళ్లిపోయిందేమోనని నక్కి నక్కి చూస్తుంటాడు. కావ్య చాంబర్ లోనే ఉంటుంది. చాలా కష్టపడి డిజైన్స్ వేశాం. అవి ఇక్కడ పెట్టడం సేఫ్ కాదేమో మేడం. నాతో పాటు తీసుకెళ్లనా..? అని శృతి అడగ్గానే రాజ్ కోపంగా శృతిని తిట్టుకుంటాడు. వద్దని ఇక్కడే ఉండనని చెప్పి కావ్య, శృతి కలిసి చాంబర్ లోంచి బయటకు వస్తుంటారు. రాజ్ పక్కకు వెళ్లి దాక్కుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.