BigTV English

Aloe Vera: చలికాలంలో.. మృదువైన చర్మం కోసం అలోవెరా

Aloe Vera: చలికాలంలో.. మృదువైన చర్మం కోసం అలోవెరా

Aloe Vera: చలికాలంలో మీ చర్మం కూడా గరుకుగా, పొడిగా మారుతుందా? అవును అయితే అలోవెరా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా ముఖానికి మెరుపును కూడా అందిస్తుంది. అలోవెరా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా అనేక చర్మ సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అలోవెరాతో ఫేస్ మాస్కులను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చల్లని గాలి, తక్కువ తేమ చర్మానికి హాని కలిగిస్తాయి.ఇటువంటి పరిస్థితిలో, అలోవెరా జెల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబందలో సహజంగా ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అంతే కాకుండామృదువుగా చేసి, చనిపోయిన చర్మ కణాలను కూడా తొలగిస్తాయి.

అలోవెరా జెల్ యొక్క ప్రయోజనాలు :


హైడ్రేట్లు – అలోవెరా జెల్ 96% నీటిని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుల నుంచి తేమ చేస్తుంది.

చర్మాన్ని శాంతపరుస్తుంది- అలోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి . ఇది స్కిన్‌పై మంటను తగ్గిస్తుంది.

చర్మాన్ని చల్లబరుస్తుంది- అలోవెరా జెల్ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా చర్మ చికాకును తగ్గిస్తుంది.

చర్మాన్ని మృదువుగా చేస్తుంది- అలోవెరా జెల్ మృత చర్మ కణాలను తొలగించి.. చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది- అలోవెరా జెల్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మచ్చల నుండి రక్షిస్తుంది- అలోవెరా జెల్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మచ్చలను తగ్గిస్తుంది.

చలికాలంలో మీరు అలోవెరా జెల్‌ను ఇతర సహజ వస్తువులతో కలిపి ఫేస్ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌లు మీ చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యవంతంగా మారుస్తుంది.

అలోవెరాతో ఫేస్ ప్యాక్స్:

1.అలోవెరా, హనీ ఫేస్ మాస్క్:
కావలసినవి:

అలోవెరా జెల్- 2 టీస్పూన్లు
తేనె- 1 టీస్పూన్

తయారీ విధానం:
పైన చెప్పిన మోతాదుల్లో అలోవెరా జెల్, తేనె తీసుకుని ఒక బౌల్ లో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

Also Read: మీ ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. మెరిసిపోతారు

2. అలోవెరా , పెరుగు ఫేస్ మాస్క్:
అలోవెరా జెల్- 2 టీస్పూన్లు
పెరుగు- 2 స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అలోవెరాతో పాటు పెరుగు వేసి మిక్స్ చేసి పేస్ట్ లాగా చేయండి. తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ ముఖం మెరిసిపోతుంది. తరుచుగా అలోవెరా ముఖానికి వాడటం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది . ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని టోన్ చేసి కాంతివంతం చేస్తుంది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×