BigTV English

Donald Trump : ఇకపై పౌరసత్వం సులువు కాదు.. ట్రంప్ ఆదేశాలు చూసి అంతా షాక్.. ఎందుకు ఇంత తొందర..

Donald Trump : ఇకపై పౌరసత్వం సులువు కాదు.. ట్రంప్ ఆదేశాలు చూసి అంతా షాక్.. ఎందుకు ఇంత తొందర..

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్.. నిముషం కూడా వృథా కాకూడదనే ఉద్దేశ్యంతో వరుస నిర్ణయాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గత అధ్యక్షులకు భిన్నంగా వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేస్తూ.. తాను ఎన్నికల్లో చెప్పిన హామీలు, తన ఆలోచనల్ని ఆచరణలో పెడుతున్నారు. ట్రంప్ సందిస్తున్న కార్యనిర్వహక ఉత్తర్వుల్లో ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల నుంచి రక్షణ రంగానికి వరకు, వాక్ స్వేచ్ఛ నుంచి అంతర్జాతీయ సంస్థల్లో అమెరికా భాగస్వామ్యం వరకు అనేక అంశాలున్నాయి.


డొనాల్డ్ ట్రంప్ తొలుత ఇమ్మిగ్రేషన్ పాలసీతో పాటు గత ప్రభుత్వంలో బైడెన్ అమలుపరిచిన 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేశారు. వాటితో పాటు నాలుగేళ్ల క్రితం ట్రంప్ అధికారం కోల్పోయినప్పుడు క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో నిందితులకు ఊరట కలిగించే ఆదేశాలు సైతం జారీ చేశారు. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన కొన్ని నిముషాల్లోనే.. జనవరి 6, 2021 నాటి యుఎస్ క్యాపిటల్ అల్లర్లలో నిందితులుగా గుర్తించిన 1,500 మంది వ్యక్తుల పూర్తి క్షమాభిక్ష కల్పిస్తూ.. ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లల్లో ఎన్నో ప్రభావంతమైనవి ఉన్నాయి. ఈ ఉత్తర్వుల జారీ దూకుడు చూసి.. రానున్న రోజుల్లో ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉండనుందో స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు.. విశ్లేషకులు.

టిక్‌టాక్ : చైనాకు చెందిన టిక్ టాక్.. ఆమెరికా యూజర్ల డేటాను స్వీకరించడంతో పాటు వారి భద్రతకు ఇబ్బందులు కలిగిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ పై నిషేధం విధించగా..జాతీయ భద్రతా ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నందున నిషేధాన్ని ఆలస్యం చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. వారి విధానాల్ని సమీక్షించుకునేందుకు 75 రోజుల సమయం ఇచ్చారు.


టారిఫ్‌లు : అమెరికా ప్రయోజనాల్ని కాపాడడమే తన లక్ష్యమనే ట్రంప్.. వాణిజ్య లోటు కారణంగా చూపుతూ.. మెక్సికో, కెనడాపై
ఫిబ్రవరి 1 నుంచి 25% వరకు సుంకాలు విధించాలని ఆదేశిస్తూ.. ఎగ్జిక్యూటీవ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. చైనా, మెక్సికో, కెనడాతో సుంకాలు, వాణిజ్య సంబంధాలను సమీక్షించాలంటూ ఫెడరల్ ఏజెన్సీలకు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

అనుచరులకు రక్షణ : గత ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలవగా.. అమెరికా వ్యాప్తంగా తీవ్ర అల్లర్లు జరిగాయి. వీధుల్లో మొదలైన పోరాటాలు.. క్రమంగా అమెరికా అధికారక భవనాల్లో ఒకటైన క్యాపిటల్ భవనం వరకు చేరాయి. 6 జనవరి 2021న యుఎస్ క్యాపిటల్ పై హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో నిందితులుగా 1500 వందల మందిపై బైడెన్ యంత్రాంగం అభియోగాలు మోపింది. వారిపై పోలీసు చర్యల్ని చేపట్టింది. ఆ ఘటనలో పాల్గన్న వారిని క్షమిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. వీరందరికీ పూర్తి క్షమాపణ కల్పించగా.. కీలకమైన 14 మంది శిక్షా కాలాల్ని తగ్గించింది.

బోర్డర్ ఎమర్జెన్సీ : మొదటి నుంచి మెక్సికో బోర్డర్ నుంచి అక్రమ వలసలపై ట్రంప్ చాలా సీరియస్ గా ఉంటారు. గతంలోనే తన హయాంలో.. మెక్సికో – యూఎస్ మధ్య అతిపెద్ద వాల్ కట్టేందుకు సైతం భారీగా ఖర్చు పెట్టారు. కానీ.. బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత ఆ పనులు నిలిచిపోయారు. ఇప్పుడు.. ట్రంప్ తిరిగి రావడంతో ఆ పనులు ప్రారంభమైయ్యాయి. మెక్సికో బోర్డర్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ట్రంప్.. వినాశకరమైన దండయాత్రగా పిలిచే.. అక్రమ ప్రవేశాల్ని నిరోధించేందుకు దళాలను మోహరించాలని ఆదేశించారు.

జన్మహక్కు పౌరసత్వం : అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. వలస వచ్చిన వారికి సైతం అమెరికాలో పిల్లలు పుడితే వాళ్లకు అమెరికా పౌరసత్వం వస్తుంది. కానీ.. ఇకపై అలా వీలు కాదని ట్రంప్ తేల్చేశారు. ఇప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టిన వలసదారుల పిల్లలకు అమెరికా పౌరసత్వం కుదరదని, తమ ఫెడరల్ ప్రభుత్వం అందుకు అంగీకరించదు అని స్పష్టం చేశారు. వందేళ్లుగా అమలవుతున్న విధానానికి స్వస్తి పలికారు.

వీటితో పాటే.. అక్రమ వలసదారులకు మరణశిక్ష విధించాలని అమెరికా న్యాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు వెలువడ్డాయి. దేశంలోని అక్రమంగా ప్రవేశించి, ఇక్కడి పౌరుల ప్రాణాలకు హాని కలిగించే వలస దారులకు ఇకపై మరణశిక్ష విధించనున్నారు. ఈమేరకు కీలక కార్యనిర్వహక ఉత్తర్వు వెలువడింది. వీటితో పాటే.. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. చమురు, గ్యాస్, మైనింగ్ కార్యకలాపాలను విస్తృతంగా పెంచడంతో పాటు సులభతరం చేయడం ద్వారా అమెరికా ఇంధన ఉత్పత్తిని విస్తరించడానికి అత్యవసర అధికారాలను కూడా ఉపయోగించారు.
అలాగే.. కొవిడ్ సమయంలో సరిగా వ్యవహరించేలేదని ఆరోపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయించారు. ట్రాన్స్ జెండర్ల విషయంలోనూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై.. ఫెడరల్ నిబంధనలు, కార్యనిర్వహక, ఇతక పత్రాల్లో ఆడ లేదా మగ అనే రెండు గుర్తింపులు మాత్రమే ఉండనున్నాయి. అలాగే.. కొవిడ్ -19 వ్యాక్సిన్‌ను తిరస్కరింతిన కారణంగా బహిష్కరణకు గురైన సైనిక సేవ సభ్యులకు పూర్తి చెల్లింపులు చేసి, తిరిగి విధుల్లోకి చేర్చుకోనున్నారు.

ఫెడరల్ ఉద్యోగుల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించనున్నట్లు తన ఉత్తర్వుల ద్వారా తెలియజేశారు. ప్రభుత్వంలోని ఉద్యోగులు… వ్యక్తిగతంగా పని ప్రదేశానికి రావాలని, వర్క్ ఫ్రమ్ హోం విధానాలు ఇకపై కొనసాగవని తేల్చి చెప్పారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×