Turmeric For White Hair: పసుపు చర్మ సౌందర్యానికే కాదు.. జుట్టు పెరుగుదలకు.. తెల్లజుట్టు శాశ్వతంగా నివారించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. పసుపును తరుచూ ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. పసుపు గాయాలు తొందరగా మానేందుకు, శ్వాశకోశ సమస్యలకు, కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉండేందుకు చక్కగా ఉపయోగపడతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పసుపును జుట్టుకు అప్లై చేశారంటే.. వైట్ హెయిర్ తొలగిపోవడంతో పాటు.. జుట్టు ఒత్తుగా పెరుగడం పక్కా.
ఈరోజుల్లో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం బయట మార్కెట్లో వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయి కానీ శాశ్వతంగా ఉండవు. కాబట్టి మన ఇంట్లోనే దొరికే పసుపుతో ఇలా చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
ఆవాలు నూనె కప్పు
పసుపు మూడు టేబుల్ స్పూన్లు
టీ స్పూన్ నల్ల జీలకర్ర
విటమిన్ ఇ క్యాప్సూల్స్
టేబుల్ స్పూన్ కాఫీపొడి.
తయారు చేసుకునే విధానం..
ముందుగా కడాయి పెట్టి అందులో ఆవాలనూనె, పసుపు, నల్ల జీలకర్ర, కాఫీపొడి, ఐదు నిమిషాల పాటు బాగా నల్లగా వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత దీన్ని చిన్న బౌల్‌లో వడకట్టుకోవాలి. అందులో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి.. ఈ నూనెను జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారడంతో పాటు, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
Also Read: కడుపునొప్పి, అజీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ?
తెల్లజుట్టు నల్లగా శాశ్వతంగా నల్లగా మార్చేందుకు మరొక చిట్కా.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
మెంతులు
బ్లాక్ సీడ్స్
పసుపు
ఆవాల నూనె
తయారు చేసుకునే విధానం..
ముందుగా పాన్ పెట్టి అందులో కావాల్సినన్ని మెంతులు, బ్లాక్ సీడ్స్ వేసి ఐదు నిమిషాలు వేయించండి. ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ పసుపు వేసి.. గ్యాస్ మంట లో ఫ్లేమ్ లో పెట్టి.. బాగా నల్లగా మాడిపోయేంతవరకు వేయించండి. ఈ మిశ్రమాన్ని మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని చిన్న బౌల్‌లో తీసుకుని అందులో మస్టర్డ్ ఆయిల్(ఆవ నూనె) కలపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి.. గంట తర్వాత సాధారణ షాంపూతూ తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం. అంతే కాదు దీనివల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.