Canada PM Justin Trudeau Resign| కెనెడా దేశంలో రాజకీయ సంక్షోభం పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ లో జరగాల్సిన ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అధికార లిబరల్ పార్టీకి, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. గత సంవత్సరం భారతదేశంపై విమర్శలు చేసిన జస్టిన్ ట్రూడో నాయకత్వం పట్ల ప్రస్తుతం సొంత పార్టీ నాయకులే అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం.
కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో త్వరలోనే లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవి రాజీనామా చేయనున్నారని సమాచారం. ఈ మేరకు ఆదివారం, జనవరి 5న అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. సోమవారం పార్టీ కీలక సమావేశం తరువాత రాజీనామా ఎప్పుడు చేయనున్నారో తెలుస్తుందని పార్టీలో కొందరు నాయకులు ది మెయిల్, గ్లోబ్ పత్రికలకు వెల్లడించారు.
అయితే కాకస్ దేశాలతో (అర్మేనియా, అజెర్ బైజాన్, జార్జియా, రష్యా) బుధవారం కెనెడా మీటింగ్ తరువాత ప్రధాన మంత్రి పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసినా.. కొత్త నాయకుడిని ఎన్నుకేనేంత వరకు పదవిలో కొనసాగే అవకాశాలున్నాయి.
లిబర్ పార్టీ అధ్యక్షుడిగా 2013 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన ట్రూడో గత ఏడాది కాలంగా కెనెడా పార్లమెంటులో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పార్లమెంటు అధికార కూటమికి సంఖ్యా బలం తగ్గిపోవడంతో పాటు సొంత పార్టీలో కూడా ఆయనపై అసంతృప్తి పెరిగిపోతోంది.
Also Read: ట్రంప్ కు జైలు శిక్ష?.. తగ్గేదెలే అంటున్న జడ్జి.. జనవరి 10న తీర్పు..
అక్టోబర్ 2025లో కెనెడాలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈ సారి ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి సర్వే రేటింగ్ స్ తక్కువగా ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్‌వేటివ్స్ కు మాత్రం గణనీయంగా ప్రజల మద్దతు పెరుగుతోంది. దీనికి కారణం లిబరల్ పార్టీకి ఇంతకాలం సన్నిహితంగా ఉన్న చిన్న పార్టీలుకు కూడా జస్టిన్ ట్రూడోకు ఎదురు తిరిగడమే.
ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తే ఎన్నికల్లో ఆ పార్టీకి గెలవడానికి ఉన్న అవకాశాలు కూడా భారీగా తగ్గిపోతాయిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఆయన రాజీనామా చేస్తే.. అక్టోబర్ లో జరగాల్సిన ఎన్నికలు ఇంకా ముందుగానే నిర్వహించాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికాలో కెనెడా, యూరోప్ దేశాల వ్యతిరేకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాబోతున్నారు. ఆయనతో డీల్ చేయడానికి కెనెడాలో స్థిరమైన ప్రభుత్వం అవసరం.
Also Read: ప్రతిపక్ష నాయకుడిని పట్టిస్తే రూ.85 లక్షల కానుక.. వెనెజూలాలో పాలిటిక్స్ పీక్స్
ప్రధాన మంత్రిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన తరువాత తాత్కాలిక అధికార బాధ్యతలు ఆర్థిక మంత్రి డొమినిక్ లీ బ్లాంక్ కూడా చేపట్టే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జస్టిన్ ట్రూడో, డొమినిక్ లీ బ్లాంక్ మధ్య చర్చలు జరిగాయని సమాచారం. అయితే లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కూడా లీ బ్లాంక్ చేపడతారా? అనేది వేచి చూడాల్సిన అంశం.