Big Stories

Health Tips: డైటింగ్ పేరుతో అన్నం తినడం మానేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?

Health Tips
Health Tips

Health Tips: నిత్య జీవితంలో డైటింగ్ పేర్లతో కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడుతుంటారు. వాటిని తినడం వల్ల బరువు తగ్గడం సాధ్యం కాదని భావిస్తుంటారు. ఈ తరుణంలో బరువు తగ్గించుకునేందుకు నెలల తరబడి వ్యాయామాలు చేస్తూ కొన్ని పదార్థాలను దూరం పెట్టడం వల్ల బరువు తగ్గినా.. శరీరానికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

డైటింగ్ పేరుతో ముఖ్యంగా అన్నం తినడం మానేస్తుంటారు. పండ్లు, ఆకుకూరలు, ప్రోటిన్ ఫుడ్ అంటూ ఇతర పదార్థాలు తీసుకుంటూ నెలల తరబడి అన్నం తినడం మాసేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల బరువు చాలా త్వరగా, ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉన్నా ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తుందట. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు మన శరీరానికి తిన్న వెంటనే శక్తిని అందిస్తాయి. అయితే పాలిష్డ్ బియ్యంలో చక్కెర స్థాయిల వల్ల శరీర బరువు త్వరగా పెరుగుతుంది. అందువల్ల చాలా మంది డైటింగ్ పేరుతో అన్నం తినకుండా ఉంటారు.

- Advertisement -

Also Read: పరగడుపున ఈ డ్రింక్ తాగితే చాలు అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్!

అన్నం తినడానికి అలవాటు పడిన జనాలు.. ఒక్కసారిగా నెలల పాటు అన్నాన్ని తినడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది కాదట. ఒక నెల రోజుల పాటు అన్నం తినకుండా ఉంటే బరువు, కొలస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కు అయితే షుగర్ చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల కొంత మంది వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తింటుంటారు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం పేరుతో 2018లో శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం నెల రోజుల పాటు అన్నం తినకపోవడం వల్ల 2 నుంచి 3 కిలోల వరకు బరువు తగ్గుతారని తేలింది.

ఇలా అన్నం తినడం పూర్తిగా మానేయడం అనారోగ్యానికి కూడా దారి తీస్తుందని తేలింది. శరీరంలో పోషకాలు లేకపోయినా అన్నం తినడం వల్ల శరీరానికి లభించే కార్బోహైడ్రేట్లు తగ్గిపోతాయి. అన్నం తినకపోవడం వల్ల నీరసంగా బలహీనంగా మారుతారు. ప్రోటిన్లు అందకపోవడంతో కండరాలు క్షీణించి అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉంటుంది. అయితే బరువు తగ్గాలి అనుకుంటే బ్యాలెన్డ్ గా తినడం మంచిది. ఒకపూట అన్నం తిని మరో రెండు పూటలు ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News