Skin Whitening Tips: ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా కనిపించాలని రకరకాల ఫేస్ క్రీములతో పాటు స్కిన్ కేర్ పాటిస్తుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం హోం రెమెడీస్ వాడటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని నేచురల్ గానే మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా వీటిని ఇంట్లోనే తయారు చేసుకుని వాడితే పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
మీరు కూడా శీతాకాలంలో మీ బుగ్గలను గులాబీ రంగులో మార్చుకోవాలనుకుంటే కూడా బీట్‌రూట్‌తో చేసిన సహజమైన బ్లష్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది. ఇది మీ బుగ్గలను రోజీగా మార్చడమే కాకుండా శీతాకాలంలో రోజువారీ మేకప్ అవసరాన్ని తగ్గిస్తుంది. మీరు దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మీ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇంట్లోనే బీట్‌రూట్ బ్లష్‌ను తయారు చేయడం ద్వారా మీ చర్మానికి సహజమైన మెరుపును అందించవచ్చు. ఇది మీ చర్మానికి పోషణను అందిస్తుంది. అంతే కాకుండా తక్కువ సమయంలోనే మెరిసేలా చేస్తుంది.
బీట్‌రూట్ బ్లష్ చేయడానికి కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్- 1
గ్లిజరిన్ – కాస్త
కంటైనర్ – 1
బీట్‌రూట్ బ్లష్ ఎలా తయారు చేయాలి ?
ముందుగా బీట్‌రూట్‌ను బాగా కడిగి ముక్కలుగా చేసి తర్వాత బౌల్ తీసుకుని గ్యాస్ పై పెట్టాలి. అనంతరం అందులో కొన్ని వాటర్ వేసి ముందుగా కట్ చేసుకున్న బీట్ రూట్ ముక్కలను వేయండి. బీట్‌రూట్ ఉడకబెట్టడం వల్ల బీట్‌రూట్ రంగు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. తర్వాత ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను చల్లారనిచ్చి, తొక్క తీసి దాని గుజ్జును తీయాలి. కావాలంటే బ్లెండర్‌లో కూడా రుబ్బుకోవచ్చు.
ఇప్పుడు బీట్‌రూట్ గుజ్జులో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలపండి. తయారుచేసిన మిశ్రమాన్ని చిన్న, శుభ్రమైన కంటైనర్‌లో నింపండి. మీరు రిఫ్రిజిరేటర్‌లో కూడా దీనిని నిల్వ చేసుకోవచ్చు.
బీట్‌రూట్ బ్లష్ ఎలా ఉపయోగించాలి ?
బ్లష్ అప్లై చేసే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీరు మీ వేళ్లు లేదా ఫేస్ బ్రష్ సహాయంతో మీ ముఖంపై ఈ క్రీమును అప్లై చేసుకోవచ్చు. 15 నిమిషాలు ఉంచి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది.
Also Read: చలికాలంలో రాత్రి పూట బెల్లం పాలు త్రాగితే.. మతిపోయే లాభాలు
బీట్‌రూట్ బ్లష్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు:
బీట్‌రూట్ బ్లష్ పూర్తిగా సహజమైనది. అంతే కాకుండా ఇందులో ఎలాంటి హానికరమైన రసాయనాలను ఉపయోగించలేదు.
బీట్‌రూట్‌లో మీ చర్మాన్ని పోషించే విటమిన్లు , మినరల్స్ కలిగి ఉంటుంది.
బీట్‌రూట్ మీ చర్మానికి సహజమైన పింక్ గ్లో ఇస్తుంది.
మీరు బీట్‌రూట్ బ్లష్‌లో తేనె, అలోవెరా జెల్ లేదా విటమిన్ ఇ ఆయిల్ వంటి ఇతర సహజ పదార్థాలను కూడా కలుపుకోవచ్చు.
బీట్‌రూట్ బ్లష్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. అవసరం అయినప్పుడు ఉపయోగించండి.