US H-1B Visa| అమెరికాలో హెవన్ బి వీసాల కోటా పిటీషన్ల సంఖ్య పరిమితికి చేరిందని అమెరికా పౌరసత్వం వలసల సేవా విభాగం (US Citizenship and Immigration Services – USCIS) ప్రకటించింది. ఇంకా హెవన్ బి వీసాల కోసం దరఖాస్తు చేయని వారికి ఈ వార్తతో పిడుగుపడినట్లు అయింది
అందుకే కొత్తగా హెవన్ బి వీసాల కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు వారి పిటీషన్లు తిరస్కరించబడతాయా? అనే సంశయంలో పడ్డారు. దీనిపై స్పష్టత కోసం అమెరికా హెవన్ బి వీసాల నియయ, నిబంధనలిలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం హెవన్ బి వీసాల పరిమితి సంఖ్యను అమెరికా ప్రభుత్వం 65,000కు నిర్ణయించింది. అయితే ఇది సాధారణ అభ్యర్థుల కోసం మాత్రమే. అడ్వాన్సడ్ డిగ్రీ కలిగి ఉన్నవారి కోసం మరో 20,000 అదనపు వీసాలకు అనుమతి ఉంది.
అయితే దరఖాస్తులను అమెరికా పౌర సేవల విభాగం తిరస్కరించే అవకాశం కూడా ఉంది. దరఖాస్తు తిరస్కరణ గురైతే అభ్యర్థులకు నాన్ సెలెక్షన్ నోటీసులు వారి ఆన్‌లైన్ అకౌంట్ల ద్వారా తెలియజేయబడతాయి. వీసా దరఖాస్తు తిరస్కరించబడితే.. అభ్యర్థుల అకౌంట్‌లో దరఖాస్తు స్టేటస్ నాట్ సెలెక్టెడ్ నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. ఇదంతా హెవన్ బి పిటీషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ప్రారంభమవుతుంది.
Also Read: ఇండియాను కాదని చైనా వెళ్లిన నేపాల్ కొత్త ప్రధాని.. బిఆర్‌ఐ ప్రాజెక్టుపై ఒప్పందం
హెవన్ బి వీసాల దరఖాస్తులు కోటాకు మించి వచ్చిన సందర్భంలో హెవన్ బి క్యాప్ లాటరీ పద్ధతిని అమెరికా ప్రభుత్వం పాటిస్తుంది. హెవన్ బి వీసా పిటీషన్ల దరఖాస్తు గడువు జూన్ 30, 2024న ముగిసింది. అయతే ఆ రోజు ఆదివారం కావడంతో జూలై 1 వరకు సమయం ఇచ్చారు. హెవన్ బి కోటా ఫుల్ అయిపోయినా అడ్వాన్స్‌డ్ డిగ్రీలు ఉన్నవారి దరఖాస్తులు ఇంకా స్వీకరించబడుతున్నాయి.
దీని గురించి అమెరికా పౌరసత్వం, వలసల విభాగం ఒక ప్రకటన జారీ చేసింది. “హెవన్ బి వీసాల పిటీషన్లు ప్రాసెసింగ్ జరుగుతోంది. అదనంగా అడ్వాన్స్‌డ్ డిగ్రీ అర్హత ఉన్నవారు పిటీషన్లు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ పూర్తయ్యేవరకు అభ్యర్థులకు అమెరికాలో ఉండేందుకు అర్హత ఉంది. పైగా హెవన్ బి వర్కర్లు వారి ఎంప్లామెంట్ షరతులు కంపెనీలతో మార్చుకోవచ్చు. ప్రస్తుతం హెవన్ బి వీసా కల వర్కర్లు కూడా కంపెనీలు మారవచ్చు,” అని పౌరసత్వం, వలసల విభాగం ప్రకటనలో పేర్కొంది.
Also Read: 10 ఏళ్ల క్రితం రూ.5900 కోట్లు చెత్తలో పడేసిన జంట.. ఇప్పుడు వెతికిపెట్టాలంటూ కోర్టులో కేసు
హెవన్ బి వీసా లాటరీ విధానం చాలా క్లిష్టమైనది. ఈ ప్రక్రియ కోసం అన్ని వివరాలను పరిశీలిస్తారు.
అమెరికాలోని ఎక్కువ శాతం హెవన్ బి వీసాలు ఉన్నవారు భారతీయులే. అమెరికా జారీ చేసిన మొత్తం 3,86,000 హెవన్ బి వీసాలలో 72.3 శాతం భారతీయులే ఉన్నారు. హెవన్ బి వీసా హోల్డర్లకు స్పాన్సర్లలో ఎక్కువగా గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, ఐబిఎం ఉన్నారు.