Besan For Skin: శనగపిండి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యానికి శతాబ్దాలుగా శనగ పిండిని ఉపయోగిస్తున్నారు. అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను శనగపిండితో తయారు చేస్తారు. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది. సహజమైన ఫేస్ ప్యాక్ లతో చర్మానికి ఎలాంటి హాని కలగదు. అంతే కాకుండా ముఖంపై ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించడంలో శనగపిండి ఫేస్ ప్యాక్ కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
శనగపిండిలో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా సహజమైన ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌లను మీ ముఖంపై క్రమం తప్పకుండా అప్లై చేయడం ద్వారా మీ ముఖం మెరిసిపోతుంది . అంతే కాకుండా ముఖం మొటిమలు లేకుండా అందంగా మారుతుంది.
శనగ పిండితో 4 ఫేస్ ప్యాక్‌లు
1. శనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్:
కావలసినవి:
శనగపిండి- 1 టీస్పూన్
పెరుగు- 1/2 టీస్పూన్
పసుపు – కాస్త
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో పైన చెప్పిన మోతాదుల్లో శనగపిండితో పాటు పెరుగు, పసుపులను తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా ముఖం అందంగా మారుతుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మం చాలా స్మూత్ గా మారుతుంది.
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సహజంగానే మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మంపై ఉన్న నూనెలను గ్రహిస్తుంది. ఇందులో వాడిన పసుపు మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది.
2. శనగపిండి, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
శనగపిండి – 2 టీస్పూన్లు
నిమ్మరసం- 1 టీస్పూన్
రోజ్ వాటర్ – కొద్దిగా
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలన్నీ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అనంతరం 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
3. శనగపిండి, తేనె ఫేస్ ప్యాక్:
కావలసినవి:
శనగపిండి- 2 టీస్పూన్లు
తేనె -1 టీస్పూన్
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అనంతరం 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇందులోని తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని మెరిసేలా తయారు చేస్తుంది.
Also Read: దానిమ్మ తొక్కలతో ఫేస్ ప్యాక్.. మీ అందం రెట్టింపు
4.శనగపిండి, ఓట్స్ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
శనగపిండి- 2 టీస్పూన్లు
ఓట్స్ పౌడర్ -1 టీస్పూన్
పాలు -కొద్దిగా
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను తీసుకుని ఒక బౌల్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఓట్స్ చర్మానికి ఉపశమనం కలిగించి మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.