BigTV English

Foods for Girls : ఆడపిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవి.. ఎందుకో తెలుసుకోండి..

Foods for Girls : ఆడపిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవి.. ఎందుకో తెలుసుకోండి..
Best Foods for Girls Health

Best Foods for Girls Health (health news today) :


ఆడపిల్లల మనసే కాదు.. శరీరం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. మగపిల్లలతో పోలిస్తే.. ఆడపిల్లలు పుట్టుకతోనే 30 శాతం తక్కువ శక్తిని కలిగి ఉంటారు. అందుకే.. చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఆడపిల్లలకు మంచి ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆడపిల్లల్లో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆడపిల్లలకు ఒక వయసు వచ్చాక రజస్వల అవుతారు. అప్పటి నుంచి ప్రతినెలా నెలసరి నొప్పి భరించక తప్పదు. ఈ సమయంలో ఆడపిల్లలు చాలా రక్తాన్ని కోల్పోతారు. దీనిని చెడు రక్తంగా భావిస్తారు.

నెలసరి కారణంగా శరీరంలో రక్తం బయటకు పోవడంతో.. రక్తహీనత ఏర్పడి నీరసించిపోతారు. ఏ పనీ చేయలేరు. శారీరకంగానే కాదు.. మానసికంగానూ వీక్ అవుతారు. ఎవరైనా ఏ చిన్న మాట అన్నా.. కాస్త కోపగించుకున్నా, కసిరినా.. ఏడ్చేస్తారు. అందుకే పీరియడ్స్ సమయంలో ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా సరైన ఆహారాన్ని అందించే బాధ్యత తల్లిదండ్రులు మరచిపోకూడదు. ఏది పడితే అది తింటే.. దాని ఫలితం తర్వాత కనిపిస్తుంది.


Read More : సమ్మర్ అని ఐస్ వాటర్ తాగేస్తున్నారా? ఒక్క సారి ఆలోచించండి బాస్..!

సాధారణంగానే ఆడపిల్లలు ఆహారం తక్కువగా తీసుకుంటారు కాబట్టి.. తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. రక్తం ఉత్పత్తికి సరిపడా ఐరన్ అందేలా డైట్ లో ప్లాన్ చేయాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్ సమయంలో గుప్పెడు గుమ్మడి గింజలు (Pumpkin Seeds) వారితో తినిపిస్తే చాలు. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. కొమ్ము శనగలను కూడా నానబెట్టి, ఉడకబెట్టి నూనెలో పోపు వేసి పెట్టండి. దీనివల్ల కూడా రక్తహీనత సమస్య రాదు.

క్వినోవా.. ఇదొక రకమైన ధాన్యం. అన్నంబదులుగా దీనిని పెట్టొచ్చు. వారానికి రెండుసార్లు క్వినోవాతో వండిన అన్నం పెట్టండి. చికెన్ లివర్ ను కర్రీలా వండి తినిపించండి. వారానికి రెండుసార్లు చికెన్, రెండుసార్లు చేపలు కచ్చితంగా పెట్టాలి. మటన్ కంపల్సరీ కాదు. చెల్లంతో చేసిన స్వీట్లు.. ముఖ్యంగా నువ్వులు, బెల్లం కలిపి పెట్టడం చాలా మంచిది.

Read More : డిప్రెషన్‌ను తగ్గించే బ్రెయిన్ పేస్ మేకర్..

రోజువారీ ఆహారాల్లో ఆకుకూరలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. కందిపప్పు లేదా పెసరపప్పుతో కలిపి వండిన ఆహారాన్ని తినిపించండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో లేదా.. రాత్రి డిన్నర్ లో ఉడికించిన కోడిగుడ్డును తినిపించడం ముఖ్యం.

అలాగే.. ఫ్రెష్ ఫ్రూట్స్ రోజుకు రెండురకాలు పెట్టండి. పుచ్చకాయ, జామకాయ, ఆపిల్ లేదా అరటిపండు.. ఇలా ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి తినడం అలవాటు చేయండి. ఇవి చర్మానికి, లోపలి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే నానబెట్టిన డ్రైఫ్రూట్స్.. బాదం, పిస్తా, సన్ ఫ్లవర్ గింజలు, జీడిపప్పు, అక్రూట్స్, అంజీర్, ఇలా అన్నీ తినిపిస్తే.. చర్మానికి, జుట్టుకు కూడా మంచిది.

Tags

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×