BigTV English

Sachin Tendulkar @ Kashmir:  ‘క్రికెట్ & కాశ్మీర్.. స్వర్గంలో ఒక మ్యాచ్’.. సచిన్

Sachin Tendulkar @ Kashmir:  ‘క్రికెట్ & కాశ్మీర్.. స్వర్గంలో ఒక మ్యాచ్’.. సచిన్
sachin tendulkar news today

Sachin Tendulkar Spotted Playing Gully Cricket in Kashmir(Sports news in telugu): సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు. భారతదేశంలో క్రికెట్ ఇంతలా ప్రాచుర్యం పొందడానికి ఆనాడు కపిల్ దేవ్ సారధ్యంలోని టీమ్ 1983లో వరల్డ్ కప్ సాధించడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత ఆరేళ్లకి అంటే 1986లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.


ఇక అప్పటి నుంచి భారతదేశంలో క్రికెట్ ఆటపై ఇంట్రస్ట్ కలగడానికి తన ఆటే ఒక కారణమయ్యింది. అందుకే భారతరత్న అందుకున్నాడు. భారతదేశంలో క్రికెట్ అభిమానులకే కాదు ప్రజలకి కూడా ఆరాధ్యుడయ్యాడు. క్రికెట్ దేవుడయ్యాడు.

అలాంటి సచిన్ ప్రస్తుతం కాశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. గుల్మార్గ్‌లో వెళుతూ అక్కడ కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడుతుంటే సడన్‌గా కారు ఆపి అక్కడ దిగాడు. అంతే అక్కడ స్థానిక యువత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ క్రికెట్ దేవుడు అక్కడికి వచ్చేసరికి ప్రజలు కూడా బిలబిలమని ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు.


వెంటనే ఆ కుర్రాళ్లు ఆడుతున్న క్రికెట్ బ్యాట్ తీసుకుని, వారిని బాల్ వేయమని అడిగాడు. వారు బాల్స్ వేస్తుంటే సరదాగా ఆడి, తన ముచ్చట తీర్చుకున్నాడు. పొడవాటి బూట్లు, ప్యాంటు, చలికి వింటర్ జాకెట్ ధరించి, రోడ్డు పక్కన ఉంచిన కార్టూన్‌ను స్టంప్‌గా భావించి షాట్‌లు ఆడుతూ ఆ ఫొటోలో సచిన్ కనిపించాడు.

Read More: సోషల్ మీడియాలో అకాయ్ సందడి.. జూనియర్ కోహ్లీ ఏఐ ఫొటోలు వైరల్..

చుట్టూ అందమైన కాశ్మీర్ మంచు కొండలు, అహ్లాదకరమైన వాతావరణం, మధ్యలో క్రికెట్.. ఇంతకన్నా మధురానుభూతి ఏముంటుందని సచిన్ కామెంట్ చేశాడు. చిన్న క్యాప్షన్ కూడా పెట్టాడు. అదేమిటంటే..
‘క్రికెట్ & కాశ్మీర్.. స్వర్గంలో ఒక మ్యాచ్ ’ అంటూ రాసుకొచ్చాడు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ఆకలి వేస్తే అందరూ అన్నం తింటారు. కొందరికి చదువు మీద ఆకలి ఉంటుంది. ఎంత చదివినా ఇంకా ఇంకా చదవాలని తపిస్తుంటారు. అదే సచిన్ టెండూల్కర్‌కి అయితే, ఆటపై ఆకలి ఉంటుంది. నిత్యం క్రికెట్‌ని ప్రేమిస్తూనే ఉంటాడు. నిరంతరం క్రికెట్‌నే శ్వాసిస్తుంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×