Big Stories

Period Pain relief Tips: పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా? ఇవి ట్రై చేయండి

Period Pain relief Tips
Period Pain relief Tips

Period Pain relief Tips: నెలనెలా మహిళలకు ఏర్పడే పీరియడ్స్ సమయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటారు. ప్రతి నెలా వారు ఎదుర్కునే సమస్యలు సహజమే అనిపించినా.. అవి వారి పనులకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తుంటాయి. కడుపు నొప్పి, నడుం నొప్పి, కాళ్ల నొప్పులు, అధిక రక్తస్రావం  వంటి సమస్యలతో పీరియడ్స్ సమయం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొని మిగతా పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మహిళలకు ఈ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా మార్గాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొంది.. హాయిగా తమ పనులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

- Advertisement -

మసాజ్:

- Advertisement -

పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నడుపునొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో లావెండర్, రోజ్ మేరి వంటి ఆయిల్ ను ఉపయోగించి నడుమును కాస్త మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

వాటర్:

తరచూ తీసుకునే నీళ్ల కంటే పీరియడ్స్ సమయంలో ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. అందులోను గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల పెయిన్ నుంచి కొంత మేరకు అయినా ఉపశమనం పొందే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు వాటర్ మాత్రమే కాకుండా.. వాటర్ లెవల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా నొప్పిని తగ్గించుకోవచ్చు. అందులో పుచ్చకాయ, కీరదోస, కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడతాయి.

Also Read: మీరు బరువు ఎందుకు పెరుగుతున్నారో తెలుసా? ఈ తప్పులు చేస్తున్నట్లే మరి

వేడి నీళ్లతో కాపడం:

పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం అనేది సహజం. ఇలా నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లతో కాపడం పెట్టడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ అవ్వొచ్చు. ఇందుకోసం హీట్ ప్యాక్ లేదా వేడి నీళ్ల బాటిల్ లో నీళ్లను నింపుకుని చేతులు కాలకుండా లేదా ఎక్కువ వేడి తగలకుండా ఓ బట్టను దానికి చుట్టాలి. అనంతరం దానిని నొప్పి ఉన్న చోట ఉంచి కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది.

ఫుడ్:

తరచూ తీసుకునే ఆహారం కాకుండా ఈ సమయంలో కాస్త హెల్తీ ఫుడ్, లైట్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియంతో నిండి ఉండే పాలు, పాల పదార్థాలు, పాలకూర వంటివి తీసుకోవడం మేలు. సాయంత్రం తీసుకునే స్నాక్స్ లో ఫ్రూట్స్, నట్స్ వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. దీంతో పాటు డార్క్ చాక్లెట్స్ కూడా తినడం మంచిది. అందులో ఉండే మెగ్నీషియం ద్వారా శరీరంలోని ఎండార్ఫిన్లు విడుదలై నొప్పి నుంచి మనసుకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News